33.2 C
Hyderabad
May 4, 2024 02: 10 AM
Slider కృష్ణ

పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి

విజయవాడలో స్థానిక బెర్మ్ పార్క్ లో కృష్ణానదిలో బోధిసిరి బోటును పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు శాఖ మంత్రి ఆర్కే రోజా మంగళవారం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 2004లో వైఎస్సార్‌ చేతుల మీదుగా ప్రారంభించిన బోధిసిరిని తిరిగి నేను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

టూరిస్ట్‌ లకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో టూరిజంకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. బోటు ప్రమాదాలు జరగకుండా ఇకపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

అనంతరం భవానీ ఐలాండ్ లో టూరిజం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాల అభివృద్ధి, వాటి నిర్వహణకు తీసుకోవాల్సి చర్యలపై అధికారులతో మంత్రి రోజా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ వర ప్రసాద్ రెడ్డి, స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఎండీ అండ్ సీఈవో కె. కన్నబాబు పాల్గొన్నారు.

మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రదేశాలున్నాయని, వాటిని వచ్చే సంవత్సరన్నర కాలంలో పర్యాటక ప్రాంతాల సమగ్రాభివృద్ధికి అధికారులందరూ కృషి చేయాలన్నారు. అధికారులు, సిబ్బంది అందరి సహకారంతో నిర్థేశిత సమయానికల్లా అన్ని అభివృద్ధి కార్యక్రమలతో ప్రమోటింగ్ కూడా జరగాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల సెఫ్టీకి మొదటి ప్రాధాన్యత ఇస్తారని, పర్యాటకులకు సౌకర్యాలను కల్పించడంతో పాటు వారి రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

బోటు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్రంలో ఏపీ టూరిజం బోట్లు 45, ప్రైవేటు బోట్లు 25 పర్యాటకులకు అందుబాటులో ఉంచామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9 ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ ద్వారా బోట్స్ మానిటర్ చేస్తున్నామని తెలిపారు. దేశ విదేశాలకు చెందిన టూరిస్ట్ లను ఆకర్షించే విధంగా రాష్ట్రంలో పర్యాటక కేంద్రానలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.

కోవిడ్ వల్ల టూరిజం ఆదాయం కొంతమేర తగ్గిందన్నారు. పర్యాటక రంగ బలోపేతానికి స్టేక్ హోల్డర్స్ తో చర్చలు జరుపుతున్నామని, పిపిపి మోడ్ లో టూరిజం డెవలప్మెంట్ చేస్తున్నామని తెలిపారు. పాపికొండలు తనకు ఇష్టమైన టూరిజం స్పాట్ అని.. బోట్ ప్రమాదం వల్ల కొన్నిచోట్ల బోటింగ్ ఆపాల్సి వచ్చిందని, అన్ని రక్షణ చర్యలతో బోటింగ్ ను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.. రాష్ట్రంలో 26 జిల్లాల కేంద్రాల్లో శిల్పారామాల ఏర్పాటు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో 2 రోప్ వేస్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇచ్చిందని, రెండు రోఫ్ వేస్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. విజయవాడ బరం పార్కులో ఒకటి, శ్రీశైలంలో మరొకటి రోప్‌ వే ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని రజత్‌ భార్గవ తెలిపారు.

సమీక్షా సమావేశంలో పర్యాటక సంస్థ అభివృద్ధికి చేపట్టిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషస్ ద్వారా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో కె. కన్నబాబు వివరించారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బెస్ట్ టూరిజం పాలసీ అవార్డు దక్కిందని తెలిపారు. సమీక్షా సమావేశంలో పర్యాటకాభివృద్ది సంస్థ హెచ్ఓడీలు, చీఫ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నాగర్ కర్నూల్ జిల్లాలో నేటి రాత్రి నుండి కర్ఫ్యూ అమలు

Satyam NEWS

సామాన్య ప్రజల పైనే మావోయిస్టుల దాడులు

Satyam NEWS

తెలంగాణ క్రీడా ప్రాంగణంలో గడ్డి, పిచ్చి మొక్కలు

Bhavani

Leave a Comment