33.7 C
Hyderabad
April 29, 2024 00: 02 AM
Slider

తెలంగాణ క్రీడా ప్రాంగణంలో గడ్డి, పిచ్చి మొక్కలు

#sports grounds

తెలంగాణ క్రీడా ప్రాంగణంలో గడ్డి పిచ్చి మొక్కలతో వెలవెలబోతుంది. గద్వాల మున్సిపాలిటీలోని 8వ వార్డు బీసీ కాలనీ లో ఉన్న తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు లక్షల్లో ఖర్చు చేసి ప్రతిపాదించారు. రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో అందరికీ కనిపించేలా ఏడు నెలల కింద బోర్డు ఏర్పాటు చేశారు. వాలీబాల్, ఖోఖో ఆటల కోసం నాలుగు కర్రలు పాతారు.

స్థలాన్ని చదును చేయడం కానీ, క్రీడలకు ఉపయోగంగా ఇతరత్రా ఎలాంటి పనులు చేపట్టలేదు. ప్రాంగణం మొత్తం గడ్డి, పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి. క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రామాలు, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే పట్టణాల్లో ప్రభుత్వ స్థలాలను సేకరించి అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి మైదానాలు వైపు ఆకర్షించేలా చర్యలు చేపట్టింది.

ఉద్దేశం మంచిదే ఆయన క్షేత్రస్థాయిలో సవాలక్ష సమస్యలతో కార్యక్రమం నత్త నడక సాగుతుంది. గద్వాల ఉన్న క్రీడా ప్రాంగణంలో గడ్డి ముళ్ళపదలు చెట్లతో నిండి ఉండగా, కనీస సదుపాయాలు కలిపించకపోవడంతో ఆశించిన ఫలితం లేకుండా పోయింది. క్రీడామైదానం సాధారణంగా ఏర్పాటు కావాలంటే అన్ని సదుపాయాలు ఉండాలి. ప్రస్తుతం ఉపాధి అధికారులు గుర్తించి ప్రాంగణంలో కోకో,వాలీబాల్,కబడ్డీ ఇతర ఆటలు కోర్టులను వేయిస్తున్నారు.

సమస్య ఉన్న చోట ప్రత్యేక పద్ధతిలో మైదానాలు ఏర్పాటు చేయాలి. కాగా ప్రభుత్వం మైదానాల చదును, క్రీడ సామాగ్రి ఇతర సదుపాయాల కోసం అంచనాలు వేయాలని చెప్పడంతో అధికారులు ఆ పనులో నిర్మాణమయ్యారు. ఎంపికైన స్థలాన్ని బట్టి ఆకర్షణ ప్రస్తుతం మున్సిపాలిటి భరిస్తే ఆ తర్వాత ప్రభుత్వం అందజేస్తుంది. దీంతో మున్సిపాలిటీలు పనులను చేసేందుకు ముందుకు రావడం లేదు. ఒకవేళ చేసిన తాత్కాలికంగా పనులు చేసి మమ అనిపించి తూతూ మంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎనిమిదో వార్డులో ఉన్న క్రీడప్రంగణాన్ని చదును చేసి యువతకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను స్థానికులు కోరుకుంటున్నారు.

Related posts

ప్రసవ సమయంలో పొరబాటు: పసికందు తలకు గాయం

Satyam NEWS

పంచలింగాల దర్శనాలకు వెళ్లిన శివస్వాములు

Satyam NEWS

గుజరాత్ లో కాంగ్రెస్ కు ఊహించని ఎదురుదెబ్బ

Satyam NEWS

Leave a Comment