Slider కడప

కరోనా లాక్ డౌన్ లో మథర్ ల్యాండ్ స్కౌట్ గ్రూప్ విశిష్ట సేవ

scouts 221

కడప జిల్లా నందలూరు మండల కేంద్రంలో ని బస్ స్టాండ్ లో గత 27 రోజులు గా కరోనా లాక్ డౌన్ కర్ఫ్యూ లో మథర్ ల్యాండ్ స్కౌట్ గ్రూప్ సభ్యులు 20 మంది సేవలందిస్తున్నారు. స్కౌట్ అధ్యక్షుడు వేపగుంట సామ్రాజ్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని ఏళ్లుగా వివిధ ప్రాంతాల్లో తన బృందం తో కలసి సేవలందించి ఉన్నారు. వీరి సేవలకు రాష్ట్రపతి అవార్డుతో పాటు అనేక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం పలు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందచేశాయి.

ఇదిలా ఉంటే ఇటీవల ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న కరోనా మహమ్మారి లాక్ డౌన్ కర్ఫ్యూ లో భాగంగా జనసామర్ధంగా ఉండకుండా ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 20 మంది పోలీసులతో కలిసి వాహనాలను,పాదాచారులను మదర్ ల్యాండ్ స్కౌట్ సభ్యులు నియంత్రి స్తున్నారు. లాక్ డౌన్ పూర్తి అయ్యే వరకు తమ సేవలు కొన సాగిస్తామని సంస్థ అధ్యక్షుడు వేపగుంట సామ్రాజ్ వెల్లడించారు. కాగా వీరి సేవలను నందలూరు ఎస్సై లక్ష్మీ ప్రసాద్ రెడ్డి అభినందించారు.

Related posts

కెసిఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నాడోచ్

mamatha

ఏపీలో మరింత మండనున్న ఎండలు

Satyam NEWS

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

Satyam NEWS

Leave a Comment