40.2 C
Hyderabad
May 5, 2024 16: 32 PM
Slider నెల్లూరు

నెల్లూరులో హైవే ప్రయాణాల పై అవగాహన ర్యాలీ

#nellorepolice

పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వెంకటాచలం పోలీస్ స్టేషన్ ఎస్ ఐ రహీమ్ రెడ్డి వారి సిబ్బంది, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ సిబ్బంది హెల్మెట్, హైవే ప్రయాణాల పై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్ ఐ రహీమ్ రెడ్డి మాట్లాడుతూ హైవే మీద ప్రయాణించేటప్పుడు లేదా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చిన్నపాటి ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ లేకపోతే ప్రాణాపాయ పరిస్ధితి వస్తుందని అన్నారు. హెల్మెట్ లేకపోవడం వల్ల తలకు గాయాలు తగిలి 95 శాతం మంది మరణిస్తున్నారని అన్నారు.

కాబట్టి హెల్మెట్ ధరించి ప్రయాణించడం వలన కొద్ది టి మరణాలను, ప్రాణాపాయ స్ధితి నుండి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కాబట్టి బైక్ మీద ప్రయాణించే ప్రతి వ్యక్తి నిదానంగా, జాగ్రత్తగా, అతి వేగంతో ప్రయాణించకుండా హెల్మెట్ ధరించి ప్రయాణిస్తే ప్రమాదాలను కొద్ది శాతం వరకు అయినా అరికట్టవచ్చునని తెలిపారు. అలాగే కారులో ప్రయాణించే వారు సిట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. ఎటువంటి పరిస్థితిలో మద్యం సేవించి వాహనాలను నడపవద్దు అని పిల్లలకు బైక్ కీస్, కారు కీస్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు.

పిల్లలు నిర్లక్ష్యంగా ర్యాష్ డైవ్ చేసి వారి ప్రాణాలకే కాకుండా ఎదుటి వారి ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నారని అలాకా కుండా జాగ్రత్తగా డైవ్ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో విక్రమ సింహపురి యూనివర్సిటీ సిబ్బంది రావు, సురేష్, అజయ్, ఉస్మాన్ అలీ,వెంకట్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎ యస్ ఐ అబ్రహం, కానిస్టేబుల్ నాగేంద్ర, శ్రీహరి, సాయి ప్రసాద్, వెంకటేష్, అవినాష్, ఇలియజ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

శ్రీ స్వామి రామానంద ఆశ్రమంలో….వైభవంగా శ్రీ గురూజీ జయంతి

Satyam NEWS

కంప్లయింట్: డబ్బూ డబ్బూ ఎక్కడకు వెళ్లావు?

Satyam NEWS

ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ని ప్రారంభించిన బండారు

Satyam NEWS

Leave a Comment