38.2 C
Hyderabad
May 1, 2024 21: 04 PM
Slider రంగారెడ్డి

ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ని ప్రారంభించిన బండారు

#oversees

పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో  ప్రాసెసింగ్ చేయాలని, అదేవిధంగా నిరుపేద విద్యార్థులు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కి వెళ్లే వారికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని ఉప్పల్ బి ఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం రామంతాపూర్ లో ఇంద్ర ఇంపరియా బిల్డింగ్ లో ప్రాప్రియేటర్ పెట్లోళ్ల లష్మికాంత్ రెడ్డి , భారత్ రెడ్డి ఏర్పాటుచేసిన యూని ప్లానెట్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా బండారి లక్ష్మారెడ్డి,  చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ తో కలిసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా బండారి  మాట్లాడుతూ పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో  ప్రాసెసింగ్ చేయాలని, అదేవిధంగా నిరుపేద విద్యార్థులు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కి వెళ్లే వారికి తన వంతు సహకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తానని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్  పార్టీ సీనియర్ నాయకులు గంధం నాగేశ్వరరావు, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సిద్ధి మహేందర్ గుప్తా ,సూరం శంకర్, బోసాని పవన్  కుమార్, విద్యార్థి నాయకుడు ప్రశాంత్ గౌడ్ తదితరులు  పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

కోవిడ్ నిబంధనలు సచివాలయానికి వర్తించవా?

Satyam NEWS

మే 10న ఇంటర్‌, మే 15న టెన్త్‌ ఫలితాలు?

Satyam NEWS

టెర్రిఫిక్ మిషప్ :యుపిలో ఘోర రోడ్డు ప్రమాదం 20 మంది మృతి

Satyam NEWS

Leave a Comment