37.7 C
Hyderabad
May 4, 2024 12: 55 PM
Slider ప్రపంచం

ట్రాన్స్‌జెండర్లు’ కు ‘ఖ్వాజసర’లకు తేడా గమనించండి ప్లీజ్

#transgender

ట్రాన్స్‌జెండర్లు’ మరియు ‘ఖ్వాజసర’ వ్యక్తుల మధ్య వ్యత్యాసాన్ని ముందుగా పాకిస్థాన్ రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలని పాకిస్తాన్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మరియా బి అన్నారు. ఆమె తన సోదరీమణులు నజియా, ఆఫియాతో కలిసి ఇన్ స్టా గ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేశారు. అందులో ముగ్గురు సోదరీమణులు ఈ అంశంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ప్రజలను ‘ట్రాన్స్‌జెండర్లు’ ను ‘ఖ్వాజాసారా’ (నపుంసకులు) అని లేబుల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ట్రాన్స్‌జెండర్లు’ నపుంసకులు కాదని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. మరియా బి. ప్రకారం, ‘నపుంసకులు’ సహజంగా పుట్టుకతో కొన్ని సంక్లిష్టతలతో పుడతారు. అలాంటి వారిని నంపుంసకులుగా పిలుస్తాం ఇంగ్లీష్ లో వారిని ‘ఇంటర్‌సెక్స్’ అని పిలుస్తారు.

మగ లేదా ఆడగా జన్మించి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత లింగమార్పిడి చేయించుకున్న వారిని ‘ట్రాన్స్‌జెండర్లు’ అంటారని ఆమె తెలిపారు. ప్రముఖ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ తండ్రి, నటి తండ్రి అయిన కైట్లిన్ జెన్నర్, తరువాత లింగాన్ని మార్చుకుని తల్లి అయ్యారని, అలాంటి వారిని ‘ట్రాన్స్‌జెండర్’ అని పిలుస్తారని ఆమె వివరించారు. అలాంటి వారిని ‘ఖజాసరా’తో కలపడం తప్పు, అలాంటి చర్య లింగమార్పిడి హక్కులకు విఘాతం కలిగిస్తుందని ఆమె అన్నారు.

‘ఖ్వాజాసార’కు ఇస్లాంలో హక్కులు ఉన్నాయని అందువల్ల పాకిస్థాన్ రాజ్యాంగంలో హక్కులు కల్పించారని, అయితే ‘ట్రాన్స్‌జెండర్లను’ ఈ జాబితాలో చేర్చలేదని ఆమె తెలిపారు. 2018లో చేసిన ఈ చట్టం వల్ల తప్పు జరుగుతున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు సోదరీమణులు ‘ట్రాన్స్‌జెండర్స్ చట్టం, 2018’ని ఉభయ సభలు ఆమోదించాయని అయితే ఈ చట్టాన్ని సవరించాలని జమాతే ఇస్లామీ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించిందని ఆమె తెలిపారు.

జమాతే ఇస్లామీ కోర్టును ఆశ్రయించిన తర్వాత, ఈ చట్టం సోషల్ మీడియా మరియు ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో చర్చకు వచ్చిందని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 26న సవరణ బిల్లు సెనేట్‌లో సమర్పించారని, దీనిని సెనేట్ కమిటీ ఆమోదించిందని ఆమె తెలిపారు. ‘నపుంసకుల’లానే ‘ట్రాన్స్‌జెండర్స్‌’కి కూడా అదే హక్కులు కల్పించడంపై ప్రజలు విమర్శిస్తున్నారని అయితే ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలని దయచేసి చట్టానికి సహకరించాలని వారు కోరారు. ‘ట్రాన్స్‌జెండర్ యాక్ట్ 2018’పై ఫెడరల్ షరియా కోర్టులో కేసు కూడా విచారణలో ఉందని ఆమె తెలిపారు.

Related posts

ఆర‌వ విడ‌త‌ హరితహారాన్ని విజయవంతం చేయాలి

Satyam NEWS

ఆగస్టు 5 నుంచి సినిమా హాళ్లను తెరుస్తున్నారు

Satyam NEWS

Breaking News: కొల్లాపూర్ లో తొలి కరోనా కేసు

Satyam NEWS

Leave a Comment