29.7 C
Hyderabad
May 4, 2024 06: 31 AM
Slider విజయనగరం

వ్యవసాయ ట్రాన్సఫార్మర్ల చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్టు

#vijayanagarampolice

విజయనగరం జిల్లా సముద్ర దీర ప్రాంతాలైన భోగాపురం, డెంకాడ, పూసపాటిరేగ మండలాల్లో వ్యవసాయ ట్రాన్సఫార్మర్ల చోరీకి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఇద్దరు నేరస్తులును 15 కేసుల్లో అరెస్టు చేసి, రిమాండుకు తరలించినట్లుగా ఈ మేరకు  విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ టి.త్రినాధ్ తెలియజేసారు.

మొత్తం మూడు మండభోగాపురం, డెంకాడ, పూసపాటిరేగ మండలాల్లో 24 ట్రాన్సఫార్లు చోరీకి గురవడంతో సంబంధిత ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్లు ఇచ్చిన ఫిర్యాదులు మేరకు భోగాపురం పిఎస్ లో 4 కేసులు, డెంకాడ పిఎస్ లో 5 కేసులు, పూసపాటిరేగ పిఎస్ లో 6 నమోదు చేసామన్నారు.

ఈ చోరీలను నియంత్రించుటలో జిల్లా ఎస్పీ ఎం.దీపిక,  ఆదేశాలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, ట్రాన్సఫార్మర్ల దొంగతనాలపై నిఘా పెట్టామన్నారు. నిందితుడు సీరపు సోములు (29 సం.లు) మరియు మరో జువైనల్ సహాయంతో భోగాపురం మండలం సుందరపేట శివార్లలో ట్రాన్సఫార్మర్ చోరీకి పాల్పడి ఈ నెల 24 తెల్లవారు జామున తిరిగి వస్తుండగా, వారిని భోగాపురం పోలీసులు అదుపులోకి తీసుకొన్నారన్నారు.

నిందితుడు సీరపు సోములు (ఎ-1) భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ మండలాల్లో వ్యవసాయ ట్రాన్సఫార్మర్ల దొంగతనాలకు గతంలో పాల్పడినట్లుగా అంగీకరించాడన్నారు. నిందితుడు సోములు చోరీ చేసిన ట్రాన్సఫార్మర్లలో గల రాగి వైరును పూసపాటిరేగలో స్క్రాప్ షాపు నడుపుతున్న వంగర మండలం అరసాడ కి చెందిన ముని దాలినాయుడు (ఎ-2) కు విక్రయిస్తున్నట్లు గా వెల్లడించడంతో అతడిని కూడా అరెస్టు చేసామన్నారు.

నిందితులు ఇద్దరి వద్ద నుండి 3.80 లక్షల విలువైన 380 కిలోల రాగి దిమ్మలు, 2 కట్టర్లు, 6 రెంచీలను, ఒక మోటారు సైకిలును స్వాధీనం చేసుకున్నట్లుగా డిఎస్పీ టి.త్రినాధ్ తెలిపారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని డిఎస్పీ త్రినాధ్ అభినందించారు. ఈ మీడియా సమావేశంలో భోగాపురం ఎస్ఐ యు.మహేష్, డెంకాడ ఎస్ఐ పద్మావతి పాల్గొన్నారు.

Related posts

వ్యాక్సిన్ చేస్తున్న మనకే వ్యాక్సిన్ లేకుండా పోతున్నది

Satyam NEWS

ఈ ప్లవం మహమ్మారిపై తిరుగుబాటు విప్లవమే..

Satyam NEWS

రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు క్రెడిట్ ఎవరికి దక్కుతుంది?

Satyam NEWS

Leave a Comment