28.2 C
Hyderabad
April 30, 2025 06: 57 AM
Slider ముఖ్యంశాలు

వ్యాక్సిన్ చేస్తున్న మనకే వ్యాక్సిన్ లేకుండా పోతున్నది

#ministerKTR

రాజన్న  సిరిసిల్ల జిల్లా తిప్పాపూర్ లో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, కరోనా పాజిటివ్ వస్తే ఇకపై హైదరాబాద్, కరీంనగర్ వంటి నగరాలకు వెళ్లే అవసరంలేదని అన్నారు. ఆక్సిజన్ లభ్యత కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన వ్యాక్సినేషన్ తీరుతెన్నులపై విచారం వ్యక్తం చేశారు. ప్రపంచం మొత్తానికి సరిపోయే వ్యాక్సిన్ హైదరాబాదులోనే తయారవుతున్నా, తెలంగాణ ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం దురదృష్టకరమని అన్నారు.

ఆయా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లలో 85 శాతం కేంద్రం తన వద్దే ఉంచుకుంటోందని, మిగిలిన 15 శాతంలోనే రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు కొనుగోలు చేయాలని షరతు విధించిందని తెలిపారు. ఇతర దేశాలకు వ్యాక్సిన్లు ఎగుమతి చేయకుండా వుంటే కనుక ఇక్కడి ప్రజలకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేవని కేటీఆర్ అన్నారు.

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ తగ్గుతోందని, ఒకవేళ మళ్లీ తీవ్రత పెరిగినా ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు.

Related posts

ప్రతి విషయానికీ ఆందోళన చెందవద్దు

Satyam NEWS

వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

Satyam NEWS

కర్నూలు ఎస్పీగా కృష్ణకాంత్ పదవీ స్వీకారం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!