41.2 C
Hyderabad
May 4, 2024 17: 04 PM
Slider ఆదిలాబాద్

నిర్మల్ ను కరోనా ఫ్రీ జోన్ గా చేద్దాం రండి

sishidhar raju

ప్రజలంతా పోలీసుకు సహరించి నిర్మల్ జిల్లాను కరోనా ఫ్రీ జిల్లాగా చేయాలని జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు అన్నారు. ఈ రోజు నిర్మల్ లోని ప్రభుత్వ అసుపత్రిలోని ఐసోలేటెడ్, పాలటెక్నిక్ కోరం టైన్ హోమ్, సోఫినాగర్ కోరం టైన్ హోమ్ లను జిల్లా ఎస్పీసి.శశిధర్ రాజు సందర్శించారు.

విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి విధి నిర్వహణలో అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాకు సంబంధించి ఇద్దరు మరణించారని, వారి కుటుంబ సభ్యులను బైంసా, నిర్మల్ ప్రభుత్వ ఐసోలేటెడ్ వార్డ్ కు తరలించామని తెలిపారు.

మర్కజ్ మస్జిద్ జమాత్ ఎవరైతే ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి రక్త నమూనాలు తీసుకుని పంపించామని ఇంకా రిజల్ట్ రాలేదని ఎస్ పి తెలిపారు. నిర్మల్ జిల్లాలో లాక్ డౌన్ కొనసాగుతున్నదని, లాక్ డౌన్ ఉన్నందున పట్టణంలో ఎవరు కూడా టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ తో బయటకు రావద్దన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలంతా తమ తమ ఇళ్లలోనే ఉండాలని కూరగాయల మార్కెట్ లలో మూడు అడుగుల సామాజిక దూరం పాటించాలని, ఇంటి నుండి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.

Related posts

తెలంగాణాలో అన్ని రిజిస్ట్రేషన్స్ నిలిపివేత

Satyam NEWS

సమన్వయంతో స్టోరేజ్‌ సమస్యను అధిగమిద్దాం

Satyam NEWS

నిర్మాతలకు “ప్రొడ్యూసర్ బజార్” ఘన ఆహ్వానం!!

Satyam NEWS

Leave a Comment