38.2 C
Hyderabad
April 29, 2024 11: 05 AM
Slider సినిమా

నిర్మాతలకు “ప్రొడ్యూసర్ బజార్” ఘన ఆహ్వానం!!

#cinema

డియర్ ప్రొడ్యూసర్స్….

కోట్లాది రూపాయలు వెచ్చించి, మీ జీవితాలను పణంగా పెట్టి.. మీరు నిర్మించే సినిమాలపై మీరు ఏవిధమైన, ఎన్ని రకాల హక్కులు కలిగి ఉంటారో మీకు సరైన అవగాహన ఉందా? మీ సినిమాలకు సంబంధించిన పూర్తి ఆదాయ మార్గాలు మీకు తెలుసా? ఇప్పుడు మీరమ్మే కొన్ని రకాల రైట్స్ కు… భవిష్యత్తులో పుట్టుకొచ్చే రైట్స్ కు కూడా అప్లై అవుతాయా? గతంలో మీరు అమ్మిన సినిమాలపై కూడా ఇంకా మీరు కొన్ని హక్కులు కలిగి ఉంటారా?

ఈ విషయాలన్నిటిపై సమగ్ర అవగాహన కల్పించుకోవడం కోసం… తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సౌజన్యంతో ప్రొడ్యూసర్ బజార్ (producerbazaar.com) నిర్వహిస్తున్న “IP Rights & Copyrights in cinema” అనే అంశంపై “అవగాహనా సదస్సు” కోసం మీ అమూల్యమైన సమయం కేటాయించండి!!

ప్రముఖ నిర్మాత – తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దిల్ రాజు అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో ఐ. పి (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ) స్ట్రాటజిస్ట్ మరియు సుప్రసిద్ధ సుప్రీం కోర్టు లాయర్ భరత్, ప్రొడ్యూసర్ బజార్ వ్యవస్థాపకులు జి.కె. తిరునావుకరసు పాల్గొని… నిర్మాతల, దర్శకుల, రచయితల సందేహాలను నివృత్తి చేస్తారు!!

ఒక సినిమాకు ఉండే “ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ – కాపీ రైట్స్”కు సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవాలనే ఆసక్తి కలిగినవారు…. తాము నిర్మించే సినిమాలకు సంబంధించిన పలు రకాల ఆదాయ మార్గాల గురించి సరైన అవగాహన కలిగి ఉండాలని కోరుకునేవారు “Ms. Supriya”ను 9176249267 నంబర్ లో… లేదా supriya@fipchain.com లో నేరుగా సంప్రదించి తమ పేరు నమోదు చేసుకోవచ్చు!!

Related posts

లాక్ డౌన్: ప్రీ పెయిడ్‌ ప్లాన్ కాల పరిమితి పొడిగించండి

Satyam NEWS

హైదరాబాద్ బోలక్ పూర్ వద్ద విద్యుత్ షాక్ తో బాలుడు మృతి

Satyam NEWS

వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

Satyam NEWS

Leave a Comment