25.2 C
Hyderabad
October 15, 2024 11: 55 AM
Slider చిత్తూరు

ఘోరం: మైనర్ బాలికపై ఇద్దరి అత్యాచారం

tirupathi rape

లిఫ్ట్ ఇస్తామని నమ్మించిన ఇద్దరు దుర్మార్గులు ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేశారు. తిరుపతి సమీపంలో ముళ్ళపూడిలో వద్ద ఈ ఘోరం జరిగింది. తిరుపతి రూరల్ మండలం, బ్రహ్మణపట్టుకు చెందిన వెంకటేష్, పద్మావతిపురంకు చెందిన రాజమోహన్ నాయక్ లు నవంబర్ 24వ తేదీ రాతి ఓ మైనర్ బాలికను అత్యాచారం చేసినట్లు డిఎస్పీ మురళీకృష్ణ తెలిపారు.

24వ తేదీ రాత్రి పద్మావతిపురం వద్ద బైక్ పై వెళుతున్న వెంకటేష్ ను ఒక బాలిక లిఫ్ట్ అడిగింది. అందుకు ఒప్పకున్న వెంకటేష్ తిరుచానూరు వరకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి బైక్ ఆపకుండా ముళ్ళపూడికి తీసుకెళ్ళాడు. బండికి పెట్రోల్ అయిపోయిందని చెప్పి తన స్నేహితుడు రాజా మోహన్ నాయక్ కు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. అనంతరం ఇద్దరు కలిసి ఆ బాలికను ముళ్లపొదళ్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసారు.

బాలిక వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి వారిద్దరిని అరెస్టు చేశారు. రాజా మోహన్ నాయక్ అనేవాడు ఒక హత్య కేసులో కూడా ముద్దాయిగా ఉన్నాడు. అత్యాచార సంఘటనలో ముద్దాయిలు ఉపయోగించిన బైక్స్ కూడా స్వాధీనం చేసుకున్నామని డిఎస్పీ తెలిపారు.

Related posts

మాస్టర్ ప్లాన్ రద్దు చేసాకే కేసీఆర్ కామారెడ్డి రావాలి

Satyam NEWS

సీరియల్ చూడొద్దని చెప్పినందుకు మహిళ ఆత్మహత్యాయత్నం

Bhavani

క్రూయల్ వైఫ్: అక్రమ సంబంధం కోసం మొగుడి హత్య

Satyam NEWS

Leave a Comment