28.7 C
Hyderabad
April 27, 2024 03: 04 AM
Slider కృష్ణ

కేంద్రం నిర్ణయంతో అడకత్తెరలో ఆంధ్రప్రదేశ్

#cmjagan

అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెప్పింది. ఇటీవలే జీఎస్టీ వాటాగా ఇచ్చిన నిధులలో రూ.982 కోట్లను కేంద్ర ప్రభుత్వం తిరిగి తీసేసుకుంది. పాత బకాయిల కింద వీటిని తిరిగి తీసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారింది. ఆర్థిక కష్టాలతో అతలాకుతలం అవుతున్న ఆంధ్రాకు ఇది ఊహించని షాక్‌. ఆర్ధికంగా దివాలా అంచుకు చేరిన ఆంధ్రా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు చెల్లించలేని దుస్థితిలో ఉన్నది. బాండ్ల వేలం ద్వారా నిధులు ఎప్పటికప్పుడు సమకూర్చుకుని కాలం గడుపుతున్న ఆంధ్రా ప్రభుత్వానికి ఇది మింగుడుపడే అంశం కాదు.

కేంద్రం అన్ని రాష్ట్రాలకు ప్రతినెలా జీఎస్టీ వాటా నిధులు విడుదల చేస్తుంది. ఇటీవల అన్ని రాష్ట్రాలకు కలిపి ఇచ్చిన మొత్తంలో రూ. 682కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సి ఉంది. ఇవికాకుండా మరో రూ.300 కోట్లా ఇతర పద్దుల కింది ఇస్తున్నట్లు కేంద్రం నుంచి సమాచారం అందింది. దాంతో ఆ నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వేచి చూస్తున్నది.

ఈ దశలో అవేవీ చేరడంలేదు. దాంతో రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులను ఆరా తీయగా ఆంధ్రప్రదేశ్ నుంచి పాత బకాయిలు రావాల్సి ఉన్నాయని, ఆ మొత్తాన్ని సర్దుబాటు చేసుకున్నామని సమాచారం అందించారు. వాటిని మళ్లీ కేంద్రం నుంచి తెచ్చుకునే అంశం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఏది ఎలా సర్దుబాటు చేయాలో అర్థంకాక ఆర్థిక యంత్రాంగం తలలు పట్టుకుంటోంది.

Related posts

బిటి రోడ్లు, జిపి భవనాలకు నిధుల మంజూరు

Satyam NEWS

ఇత్తడి.. పుత్తడని నమ్మించి మోసం.. పోలీసులు అదుపులో నిందితులు

Satyam NEWS

లక్ష యువ గర్జన: భగవద్గీత పారాయణ పోస్టర్ ఆవిష్కరించిన విశ్వ హిందూ పరిషత్

Satyam NEWS

Leave a Comment