Slider తూర్పుగోదావరి

యువకుడిని కత్తితో పొడిచిన గుర్తుతెలియని యువకులు

#youths

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.. రావులపాలెం మండలం రావులపాలెం సి.ఆర్ సి రోడ్ లో ఓ యువకుడు కత్తిపోటుకు గురయ్యాడు. వెంటనే 108లో కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి యువకుడు ని తరలించారు.వెంటనే అతడికి చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఎవరో గుర్తుతెలియని యువకులు తనతో వాగ్వాదానికి దిగి కత్తితో పొడిచారని బాధిత యువకుడు తెలిపాడు. తన పేరు చోటు రెడ్డి అని తమ ఊరు ఇచ్చాపురం అని యువకుడు చెప్పాడు. రావులపాలెం పరిసర ప్రాంతాల్లో పనులు కోసం ఇక్కడికి వచ్చామని అన్నాడు.అయితే ఈరోజు గుర్తు తెలియని యువకులు సి ఆర్ సి రోడ్డులో తనతో వాగ్వాదానికి దిగి కత్తితో పొడిచారని చెప్పాడు. ఈ మేరకు పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.

Related posts

ప్రొఫెసర్ జయ శంకర్ సార్ ఆశయ సాధన దిశగా పాలన

Satyam NEWS

హేట్స్ ఆఫ్: ఇలాంటి కలెక్టర్ ఒక్కడున్నా చాలు

Satyam NEWS

ఎన్నికల సంఘం తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం

Satyam NEWS

Leave a Comment