41.2 C
Hyderabad
May 4, 2024 16: 01 PM
Slider జాతీయం

హత్య కేసులో సత్వర చర్యలు: గగ్గోలు పెడుతున్న నిందితులు

#yogiadityanath

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో తీవ్రవాదోపవాదాలు చెలరేగిన ఉమేష్ పాల్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. 2005 లో బిఎస్ పి ఎమ్మెల్యే రాజ్ పాల్ హత్య జరిగింది. ఈ హత్యలో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను కొందరు ప్రయాగ్ రాజ్ జిల్లాలో నాటుబాంబుల దాడిలో హత్య చేశారు. ఎమ్మెల్యే రాజ్ పాల్ హత్య కేసులో నిందితుడు అయిన మాఫియా డాన్, సమాజ్ వాది పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు అతిక్ అహ్మద్ కాగా అతడి గ్యాంగ్ ఎమ్మెల్యే హత్య కేసులో సాక్షిని అడ్డుతొలగించుకుంటే తమకు శిక్ష పడదని భావించి ఉమేష్ ను హతమార్చారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయని ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఆయన ఆరోపణలకు సమాధానంగా హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నది సమాజ్ వాది పార్టీయేనని ప్రత్యారోపణలు చేశారు.

ఉమేష్ హత్యకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం ప్రకటించారు. సీఎం ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే ఉమేష్ ను హత్య చేసిన వారిలో ఒకరిని పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపారు. మిగిలిన వారిని కూడా తర్వలోనే పట్టుకుంటామని ప్రయాగ్ రాజ్ పోలీసులు ప్రకటించారు. మాఫియా డాన్, సమాజ్ వాది పార్టీ నాయకుడు అతిక్ అహ్మద్ ఇద్దరు కొడుకులను కూడా పోలీసులు ఎత్తుకెళ్లారు.

దాంతో ధుమన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సోమవారం అతిక్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్ ఒక పిటీషన్ దాఖలు చేసింది.  షైస్తా పర్వీన్ తన న్యాయవాది విజయ్ మిశ్రా ద్వారా దరఖాస్తును దాఖలు చేస్తూ ఈ నేరంలో తన కుటుంబం మొత్తాన్ని టార్గెట్ చేశారని పేర్కొన్నారు. sఫిబ్రవరి 24, 2023, సాయంత్రం ఆరు గంటలకు, నా మైనర్ కుమారులు ఎజామ్ అహ్మద్ మరియు అబాన్ అహ్మద్‌లను చట్ట విరుద్ధంగా పోలీస్ స్టేషన్ ధుమన్‌గంజ్ తీసుకువెళ్లారు, కానీ ఈ రోజు ఫిబ్రవరి 27, 2023 వరకు, నా కొడుకులిద్దరూ జాడ లేదు. పోలీస్ స్టేషన్ ద్వారా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు, చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. నా మైనర్ కొడుకులతో ధుమన్‌గంజ్ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేస్తారోనని భయంగా ఉంది అని ఆమె అన్నారు.

Related posts

ఫ్రాన్స్ ప్రముఖులకు ప్రధాని మోదీ ఇచ్చిన బహుమతులు ఇవే

Satyam NEWS

అనాదిగా భారత్ పై విషం చిమ్ముతున్న భుట్టో కుటుంబం

Satyam NEWS

ఎన్నారైలో ఆసుపత్రిలో ప్రమాదం: వ్యక్తి మృతి

Satyam NEWS

Leave a Comment