Slider ప్రత్యేకం

మేం చేసిన వాటికే మళ్లీ శంకుస్థాపనలా?

#uttam

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇందిరా భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తంకుమార్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు ఐటి మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు ద్వారా శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకున్నవి గతంలో తాము చేసిన పనులకే మళ్ళీ వాళ్లు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారని అన్నారు.

తాను హౌసింగ్ మినిస్టర్ గా  ఉన్నప్పుడు 100 ఎకరాల పైచిలుకు ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ నుండి హౌసింగ్ డిపార్ట్ మెంట్ కు మార్చామని, 2160 ప్లాట్లకు 86 కోట్లతో పనులు మొదలు పెట్టామని,విద్యుత్,నీటి సౌకర్యం, రోడ్లకు దాదాపు 20 కోట్ల పనులకు డబ్బులు కేటాయించడం జరిగిందని, ఆ పనులు చేసే క్రమంలో దురదృష్టవశాత్తూ రాష్ట్ర వినజన జరిగి ప్రభుత్వం మారడంతో పనులను ఈ ప్రభుత్వమే నిలిపివేసిందని అన్నారు.

ఈరోజు ఎమ్మెల్యే కార్యాలయం కట్టినా, బంజారా భవన్ కట్టినా,ఇంకా పల్లె ప్రకృతి వనం కట్టినా,రైతు వేదిక కట్టినా ఇవన్నీ తాను సేకరించిన భూమిలోనే అని, దురదృష్టం ఏమిటి అంటే అక్కడ వీరి హయాంలో ఆ ఇండ్లను డంపింగ్ యార్డ్ గా మార్చారని,మళ్ళీ మేమే ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళితే దానికి కూడా టెండర్లు వేసి చెత్త క్లీన్ చేశారని అన్నారు. హౌసింగ్ కాలనీకి పోయే దారిపైన బ్రిడ్జి, అదే రోడ్డు ద్వారా 80 శాతం రింగ్ రోడ్డు వేయడం జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.

ఈరోజు బి ఆర్ ఎస్ మళ్ళీ శంకుస్థాపన చేసిన ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి ఆ ఇండ్లను అర్హులైన పేదలకు అందించాలని అన్నారు.సిఆర్ఎఫ్ ఫండ్ క్రింద కీతావారి గూడెం నుండి మునగాల కు వెళ్ళే రోడ్డు నిర్మాణం తాను కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయించిందే అని,ఈ ఎస్ ఐ హాస్పిటల్ కు సంబంధించి డాక్టర్లు లేరు,స్టాఫ్ లేరు,పేషంట్లు లేరు,అది ఏ విధంగా ప్రజలకు ఉపయోగ పడుతుంది అనేది చూడాలని అన్నారు.ఇందులో కాంట్రాక్ట్ పద్దతిలో విధుల్లో చేరే వారి వద్ద నుండి 3 లక్షల రూపాయల పైనే వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని అన్నారు.

540 సర్వే భూమిలో కబ్జాకు గురి ఐన 46 ఎకరాల భూమిని వెంటనే స్వాధీన పరచుకుని కబ్జాకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని,అలాగే మున్సిపల్ ల్యాండ్స్ విషయంలో అవకతవకలు జరిగాయని,100 కోట్ల రూపాయల పైచిలుకు భూములు కబ్జాలకు గురి అవుతున్నాయని కెటిఆర్ కు తెలియచేయడం జరిగిందని అన్నారు.

ఆరు నెలల క్రితం మున్సిపల్ కమిషనర్ కంప్యూటర్ లాగిన్ దొంగలించిన విషయంపై చర్యలు తీసుకోవాలని తెలపడం జరిగిందని,కెటిఆర్,జగదీష్ రెడ్డి ఇద్దరు మంత్రులు కూడా వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారని ఉత్తమ్ తెలిపారు.హుజూర్ నగర్ లో ఎమ్మార్వో కార్యాలయం,పోలీస్ స్టేషన్,ప్రభుత్వ ఆస్పత్రి,కోర్టు,రోడ్లు,డివైడర్లు,సెంట్రల్ లైటింగ్,మట్టపల్లి బ్రిడ్జ్,అన్ని గ్రామాలకు రోడ్లు ఈరోజు కెటిఆర్ తిరిగిన రోడ్లు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని నిర్మాణాలు తన హయాంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరిగాయని,ఈ విషయం ఎవరిని అడిగినా చెబుతారు ఉత్తమ్ అన్నారు.

ఈ ప్రాంతంలో అన్ని లిఫ్ట్ లు తన హయాంలోనే నిర్మాణాలు జరిగాయని, వాటిని మేంటెనెన్స్ చేయలేక మళ్ళీ ఇప్పుడు మూడు వేల కోట్లతో అన్ని మేమే నిర్మాణాలు చేశాం అనడం బోగస్ అని అన్నారు.హుజూర్ నగర్ లో 50 వేల ఓట్ల మెజారిటీతో ఈ సారి తామే గెలువ పోతున్నామని,ఇందులో ఒక్క ఓటు తగ్గిన రాజకీయాల నుండి స్వచ్ఛందంగా తప్పుకుంటానని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

కామెడీ స్టేషన్స్: నవ్వుకోవాలంటే ఈ పోలీస్ స్టేషన్ కు వెళ్ళండి

Satyam NEWS

రూ.15 కోట్లతో మల్టీ యుటిలిటీ సెంటర్‌ నిర్మాణానికి అవగాహనా ఒప్పందం

Bhavani

కేసీఆర్ సేవలు దేశానికి అవసరం: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

Satyam NEWS

Leave a Comment