36 C
Hyderabad
May 13, 2025 12: 27 PM
Slider జాతీయం

కామెడీ స్టేషన్స్: నవ్వుకోవాలంటే ఈ పోలీస్ స్టేషన్ కు వెళ్ళండి

police stations became cartoon

పోలీస్​స్టేషన్​, ఈ మాట వింటే చాలు చాలా మందికి దడ దడ . చీకటి గదుల లాకప్​లు, ఖాకీ డ్రెస్సులో గంభీరంగా ఉండే పోలీసులను చూస్తే దడ పుట్టేస్తుంది. అంతకు మించి వారు తంతారనే భయం.కానీ, ఇకపై పోలీస్​స్టేషన్లకు వెళితే మాత్రం కావాల్సినంత నవ్వు కోవచ్చు.కడుపారా నవ్వాలా అయితే పోలీస్ స్టేషన్ కు వెళ్ళండి. కారణం ఆ పోలీస్​స్టేషన్లలోని కార్టూన్ల మహిమ! అవును, జనాల్లో పోలీస్​స్టేషన్​ అనే భయాన్ని పోగొట్టేందుకు కేరళ పోలీస్​ డిపార్ట్​మెంట్​ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 481 పోలీస్​స్టేషన్ల గోడలపై కార్టూన్లు వేయించేందుకు నిర్ణయించింది.

రెండు నెలల్లో అన్ని పోలీస్​స్టేషన్ల గోడలపై కార్టూన్లను వేసే ప్రోగ్రామ్​ను కేరళ డీజీపీ లోక్​నాథ్​ బెహరా ప్రారంభించారు. ఇప్పటికే ఫోర్ట్​, వలియథురా, కోవలం, వంచియూర్​, మ్యూజియం, పెరూరకడ పోలీస్​స్టేషన్లలో ఏర్పాటు చేసేందుకు కార్టూన్లూ అందాయి. నవ్వు తెప్పించేవే కాకుండా సమాజానికి అవసరమయ్యే యాంటీ కరప్షన్​, హ్యుమానిటీ వంటి వాటినీ కార్టూన్ల రూపంలో చెప్పనుంది. ఆసక్తి ఉన్న వారు ఎవరైనా కార్టూన్లు వేసి పంపించొచ్చని బెహరా చెప్పారు.

Related posts

గంటస్థంభం సాక్షిగా 60 వాహనాలపై కేసులు..

Satyam NEWS

చేపట్టే పనుల వివరాలను మన ఊరు మన బడి వెబ్సైట్లో పొందుపర్చాలి

Satyam NEWS

వైయస్సార్ వాహనమిత్ర కార్యక్రమం లో మంత్రి ఆర్కే రోజా

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!