35.2 C
Hyderabad
April 30, 2024 23: 23 PM
Slider నిజామాబాద్

కేసీఆర్ సేవలు దేశానికి అవసరం: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

#gampagovardhan

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సేవలు ఈ రాష్ట్రానికి, దేశానికి అవసరమని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్ లో ఏర్పాటు చేసిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 70 కిలోల కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా కేసీఆర్ అభివృద్ధి చేశారన్నారు. గడిచిన ఎన్నికల్లో అలవికాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. గత 2 నెలల నుంచి కాంగ్రెస్ పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

తాము అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాలడలేదన్నారు. బస్వాపూర్ గ్రామంలో జరిగిన ఫ్లెక్సీ చించివేత ఘటనలో తమ పార్టీకి చెందిన కొందరిని కాంగ్రెస్ నాయకులు భీంరెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, గాల్ రెడ్డి సహా మరొక 20 మంది కలిసి పోలీస్ స్టేషన్లో కొట్టారన్నారు. ఈ విషయమై జిల్లా ఎస్పీకి తాను ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో ఇలా చేయడమేంటనీ అడిగితే ఎస్పీ సానుకూలంగా స్పందించారన్నారు. అదేరోజు రాత్రి 12 గంటలకు ఎస్సై, సిఐ గ్రామానికి వచ్చి బాధితుల నుంచి పిటిషన్ తీసుకుని కాంగ్రెస్ నాయకులను రిమాండుకు పంపించారన్నారు. పోలీస్ స్టేషన్లను కాంగ్రెస్ కార్యాలయాలుగా మారిస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదన్నారు.

కార్యకర్తలకు ఎవరికేం జరిగినా అండగా ఉంటామని, మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చేదాకా పోరాటం ఆగదని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో డిసెంబర్ 9 నాడు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు చేయలేదన్నారు. రైతుబంధు పూర్తిస్థాయిలో ఇంకా అమలు చేయలేదని విమర్శించారు. మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బండారం బయటపడుతుందన్నారు. మళ్ళీ పాత రోజులు వస్తాయని, గల్లా ఎగురవేసి అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా.అధ్యక్షుడు ముజీబోద్దీన్, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్ రావు, బీఆర్ఎస్ నాయకులు నిట్టు వేణుగోపాల్ రావు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో పేద, మధ్య తరగతి ప్రజలు ఊసే లేదు

Satyam NEWS

ఇచ్చిన మాట నిలుపుకున్న కేటీఆర్

Satyam NEWS

యువ‌త కోసం 20 రోజుల డిజిట‌ల్ మార్కెటింగ్ ఉచిత శిక్ష‌ణ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment