27.7 C
Hyderabad
May 4, 2024 07: 18 AM
Slider మహబూబ్ నగర్

ఆచరణలో లేని ఆన్ లైన్-వనపర్తిలో పని చేయని వాక్సినేషన్ సెంటర్

#coronavaccine

ఉచిత కరోన టికా-వాక్సినేషన్ వేయించుకోవడానికి ఆన్ లైన్ లో ఆదార్ నంబర్,సెల్ నంబర్, పేరు, చిరునామా వివరాలు నమోదు చేయగా తేదీ 10-09-2021నాడు వ్యాక్సిన్ వేయించుకోవాలని సెల్ కు మెస్సేజ్ వచ్చింది. మెస్సేజ్ పొందిన వారికి వాక్సినేషన్ రెఫరెన్సు నంబర్ 78256392834890 ఇచ్చారు.మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటలలోగా వాక్సినేషన్ సెంటర్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల,వనపర్తికి రావాలని మెస్సేజ్ పంపారు. సదరు వ్యక్తి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు వెళ్ళగా సెంటర్ లేదు.కళాశాలకు తాళం ఉంది.వాక్సినేషన్ సెంటర్ పని చేయకుంటే ఆన్ లైన్ లో సెలవు లేదా పని చేయదని,మూత పడిందని ఆన్ లైన్ లో నమోదు చేయాలని పలువురు కోరుతున్నారు.10 మంది వస్తే వ్యాక్సిన్ ఇవ్వాలని నిబంధన లేకుండా 10 మంది వచ్చినా,రాకున్నా వాక్సిన్ ఇవ్వాలని,వాక్సినేషన్ సెంటర్ పని చేయనందుకు ఆన్ లైన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, వాక్సినేషన్ సెంటర్ల నిబంధనలు,గ్రీవన్స్ చిరునామా తెలిపే బోర్డు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్

Related posts

ఎంత పని చేశావయ్యా వకీల్ సాబ్……..?

Satyam NEWS

జనతా కర్ఫ్యూలో అధికార యంత్రాంగం ముందు

Satyam NEWS

కల్వకుర్తి – మల్లెపల్లి జాతీయ రహదారిపై సమీక్ష

Satyam NEWS

Leave a Comment