బిచ్కుంద మండలంలో కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫూ లో అధికారులు తీరిక లేకుండా ప్రజలను అప్రమత్తం చేశారు. బిచ్కుంద మండల రెవెన్యూ అధికారులు ఎంపీడీవోతో పాటు మండల పరిషత్ అధికారులు పోలీస్ అధికారులు ఆశా సంబంధిత యంత్రాంగం తీవ్రంగా శ్రమించారు.
ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలకు అప్రమత్తత చేయడం పట్ల మండల ప్రజలు ఆయా శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచమంతా కరొనా వైరస్ విజృంభిస్తోంది ఈ భయానక పిశాచాన్ని తరిమికొట్టడానికి చాలామంది అహర్నిశలు కృషి చేస్తున్నారు.
ఇక ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు అందరూ బయటకి వచ్చి ఐదు నిమిషాలు చప్పట్లు కొట్టి కరోనా వ్యాప్తికి వ్యతిరేకంగా కృషి చేస్తున్న వారికి కృతజ్ఞతలు తెలుపుదాం అని బిచ్కుంద బస్టాండ్ పరిసర ప్రాంతంలో రెవెన్యూ పోలీస్ సిబ్బంది చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలిపారు.
అదే విధంగా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కుటుంబ సభ్యులతో కలిసి చప్పట్లు కొడుతూ కరోనా వైరస్ వ్యాధిని అరికట్టడానికి కృషి చేసిన అధికారులకు ప్రజలకు కృతజ్ఞత తెలిపారు. బిచ్కుంద మండలంలోని ఆయా గ్రామాల్లో ఇంట్లోనే ఉండీ బయటకు రాకుండా కరోనా వైరస్ ను తరిమికొట్టే విధంగా స్వచ్ఛందంగా ప్రజలు బయటకు రాకుండా జనతా కర్ఫ్యూ ను మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిచ్కుంద మండల తహసీల్దార్ వెంకట్రావు మాట్లాడుతూ నేడు కరోనా వైరస్ అనే మహమ్మారి సోకి కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అదేశానుసారం నేడు జనత కర్ప్యూ విధించారు. అందుకు జనాల నుంచి మంచి స్పందన వచ్చిందని అన్నారు.