రాష్ట్ర వ్యాప్త కరోనా లాక్ డౌన్ లో భాగంగా సోమవారం కడప జిల్లా రాజంపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్ లో రద్దీని నివారించేందుకు జూనియర్ కాలేజీ గ్రౌండ్ కు తరలించారు. పట్టణం కు దూరంగా తరలించడం వలన కూరగాయల కొనుగోలుకు వినియోగదారులు గ్రౌండ్ కి తరలి వస్తున్నారు.
పట్టణంలో రద్దీ మధ్య ఇరుకైన ప్రాంతం లో మార్కెట్ కొనసాగేది. కరోనా మహమ్మారి మూలంగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు జనాలు గుమ్మి కూడా కుండా అనేక జాగ్రత్తగా లు తీసుకుంటోంది. ఈనెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపధ్యంలో కూరగాయల మార్కెట్ గ్రౌండ్ కు తరలించడం మూలంగా విస్తారమైన ప్రాంతంలో ప్రజల ఆరోగ్యానికి డోకా ఉండదని అధికారులు నిర్ణయానికి వచ్చారు.
ఈనెల 31వరకు ఈ తాత్కాలిక మార్కెట్ కొనసాగనున్నది. కొంతమంది కూరగాయల వ్యాపారులు పాత మార్కెట్ లోనే అధికారుల మాటలు లెక్క చేయకుండా కొనసాగించడం పై అధికారుల ఉదాసీన వైఖరి పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.