41.2 C
Hyderabad
May 4, 2024 16: 59 PM
Slider శ్రీకాకుళం

ప్రమాదకరంగా వంశధార ప్రాజక్టు వయాడక్ట్

#vamsadharaproject

శ్రీకాకుళం జిల్లాలో హిరమండలం, ఎల్ఎన్ పేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస, శ్రీకాకుళం, గార మండలాలలో మీకు వ్యవసాయ భూములున్నాయా? అయితే ఈ వీడియోలను చూసి స్పందించండి అంటున్నారు బిజెపి ఇ-లైబ్రరీ రాష్ట్ర కన్వీనర్ చల్లా వెంకటేశ్వర రావు అన్నారు. ఆమదాలవలస వద్ద వంశధార ప్రాజక్టు వయాడక్ట్ ప్రమాదకరంగా ఉన్న విషయం పై రాష్ట్ర జలవనరుల శాఖ సాంకేతిక సిబ్బంది వచ్చి చూసారని అయితే, వారికి ఏమి చేయాలో తెలియలేదని ఆయన అన్నారు. సమస్యను ఐఐటి వారికి నివేదించారు. వారు ఏ విధమైన సలహా ఇస్తారో చూడాలి. ఎప్పుడయినా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. లేదంటే సాగునీరుని పంపడం ఆపేయాలి. ఆపేస్తే పై ఆరు మండలాలకు సాగు నీరందక, వేలాది ఎకరాలకు నష్టం  జరుగుతుంది. నిర్మాణం సమయంలోనే సరైన పర్యవేక్షణ చేసి ఉంటే, ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ప్రమాదం జరిగితే ప్రాణ నష్టమే కాకుండా, సమీప గ్రామాలు ముంపుకు గురవుతాయి అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వయాడక్ట్ ప్రమాదంలో ఉందని అనుకుంటే, దీనికి తోడు అక్కడ ఉన్న రక్షణ గోడను కొట్టుకోమని ప్రైవేట్ వ్యక్తులకు వంశధార ప్రాజక్టు అధికారులు అనుమతులిచ్చారని ఆయన అన్నారు. దీనికి అడ్డుకున్న గ్రామస్తులు అభ్యంతరం చెప్పారని ఆయన వివరించారు. వయాడక్ట్ కూలిపోతే ప్రాణనష్టం, సమీప గ్రామాల ముంపు, 6 మండలాలలో పొలాలకు సాగు నీరు ఆగిపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. వెంటనే చర్యలు తీసుకోమని చల్లా వెంకటేశ్వర రావు అధ్వర్యంలో బిజెపి నాయకులు వంశధార ప్రాజక్టు సూపెరింటెండెంట్ ఇంజినీరు కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది

ఈ క్రింది వీడియోలు చూడండి       

https://fb.watch/hTo315NTZ0/

https://fb.watch/hTogdeKTdE/

Related posts

లిక్కర్ కేసులో సీఎం కేసీఆర్ బిడ్డ అరెస్ట్ ఖాయం

Satyam NEWS

హుజుర్ నగర్ లో ఘనంగా మదర్ థెరిస్సా జయంతి

Satyam NEWS

అంతరిక్షంలో మరో అద్భుతం: భూమికి దగ్గరగా శని

Satyam NEWS

Leave a Comment