36.2 C
Hyderabad
April 27, 2024 22: 23 PM
Slider నల్గొండ

హుజుర్ నగర్ లో ఘనంగా మదర్ థెరిస్సా జయంతి

#MotherTerisa

దగ్గుపాటి సుశీల రాజారత్నం డి‌.ఎస్.ఆర్. ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో   మదర్ థెరిసా 110 వ జయంతి వేడుకలు ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ మదర్ థెరిస్సా కలకత్తా నగరంలో మురికివాడలలో ఎంతో మంది అనాధ పిల్లలకు చదువు చెప్పటం, వికలాంగులకు, కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవ చేశారని అన్నారు.

భారత దేశ పౌరసత్వాన్ని స్వీకరించి 1950 వ, సంవత్సరంలో కలకత్తా నగరంలో మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థను స్థాపించి ఎంతోమంది అనాధలకు సేవ చేసిందని కొనియాడారు. తన మానవ సేవకు  1979లో, “నోబెల్ శాంతి” పురస్కారం,1980లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన “భారతరత్న” పొందారని తెలిపారు.

మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీస్ మదర్ చనిపోయే నాటికి 1997 సెప్టెంబర్ 5 నాటికి తన సేవా సంస్థలను 123 దేశాల్లో వ్యాపించి అనాధ శరణాలయాలు,పాఠశాలలు స్థాపించి దీనుల పట్ల దేవతగా మన్ననలను పొందిన మాతృమూర్తి అని అన్నారు.

ఈ కార్యక్రమాల్లో  కామళ మార్క్స్, పాశం నరసింహారావు, ములకలపల్లి రాంబాబు, షరీఫ్, ఏటీఎం. రాము, దగ్గుపాటి సతీష్, శీను,జగన్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పలుకవా శ్రీవాణీ నీకు ట్రస్టు ఎందుకు పెట్టారు?

Satyam NEWS

ఘనంగా భత్యాల వర్గీయుల టీడీపీ ఆవిర్భావ కార్యక్రమాలు

Satyam NEWS

కళ్యాణదుర్గంలో జగనన్న విద్యా కానుక ప్రారంభం

Satyam NEWS

Leave a Comment