41.2 C
Hyderabad
May 4, 2024 17: 32 PM
Slider విజయనగరం

చైన్ స్నేచింగ్ జ‌రిగి అతి కొద్ది గంట‌ల‌లోనే నిందితుడు అరెస్ట్…!

#vijayanagarampolice

పిల్ల‌ల‌ను ఓ కంట క‌నిపెట్టాలంటున్న విజ‌య‌న‌గ‌రం ఏఎస్పీ  అనిల్

ఎన్.సీ.ఆర్.బీ నివేదిక‌ల‌లో విజ‌య‌న‌గ‌రం స‌బ్  డివిజ‌న్ పోలీసులు…..!

చోరీ జ‌రిగిన అతి కొద్ది  గంట‌ల‌లోనే నిందితుడ్ని ప‌ట్టుకున్న పోలీసులు..!

ప‌క్కా ప్లాన్ తోనే చోరీ సొత్తును రిక‌వ‌రీ చేసిన క్రైమ్  విభాగ సిబ్బంది….!

ఫిర్యాదు అందిన 48 గంట‌ల‌లోనే పోలీసులు అదుపులో అక్యూస్జ‌డ్…!

చ‌దివారు గా  ఇదీ విజ‌య‌న‌గ‌రంలో  అదీ స‌బ్ డివిజన్ ప‌రిధిలో వ‌న్ ,టౌన్ స్టేష‌న్ల పోలీసులు ప‌నితీరు. అంతేనా…ఆయా స్టేష‌న్ ల‌లోఉన్న క్రైమ్ బృందం….సీఐలు, డీఎస్పీ చెప్పిన‌,ఆదేశాలు,సూచ‌న‌ల‌ను పాటించ‌డంతో… దొంగ‌త‌నం జ‌రిగి అతి కొద్ది గంట‌లలోనే అంటే 48 గంట‌ల‌లోనే నిందితుడిని ప‌ట్టుకున్నారు.

వివ‌రాల్లోకి వెళితే.ఈనెల అంటే ఏప్రియ‌ల్ 27 వ తేదీ  రాత్రి 8.45 గంటల సమయంలో విజయనగరంకు చెందిన వ్యక్తి తన హార్డ్వేర్ షాపును మూసివేసి తన భార్యతో కలిసి తనబైక్ పై విజయనగరం రామానాయుడు రోడ్డులో పిజి స్టార్ హాస్పిటల్ మీదుగా వెళ్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి బైకుపై వేగంగా వచ్చి తన భార్య వద్ద  ఉన్న బ్యాగును లాక్కొని పరారైనట్లు వన్ టౌన్ పోలీసు స్టేషనుకు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

పిర్యాదు అందుకున్నవెంట‌నే  వ‌న్ టౌన్ సీఐ ముర‌ళీ..ఆధ్వ‌ర్యంలో క్రైమ్ బృందం ఎస్ఐలు, అశోక్ కుమార్,దుర్గా ప్ర‌సాద్  తోపాటు సిబ్బంది…స్పాట్ న‌కు వెళ్ల‌డంతో  సీపీ పుటేజ్ ను క్షుణ్ణంగా ప‌రిశీలించారు.ఆపుటేజ్ఆధారంగా బైక్ ను ట్రాక్ చేసి స్నేచింగ్ ఎంఒను పరిశీలించారు.

ఆ  బైకు విశాఖ‌లోని కంచరపాలెం, బర్మాకోలనీ వద్ద పార్క్ చేసి ఉన్నట్లు గుర్తించి, సదరు ఎపాచి మోటారుసైకిల్ ఇంజిన్ నెంబరు ఆధారంగా, బైకు నెంబరు మరియు అడ్రస్ గుర్తించారు….వ‌న్ టౌన్ క్రైమ్ పార్టీ బృందం.త‌మ పై  ఉన్న‌తాధికారుల ఆదేశాల‌తో…చైన్ స్నాచింగ్ న‌కు పాల్ప‌డ్డ‌… నిందితుడు. రాజేషను అరెస్టు చేసారు…పోలీసులు. అతగాడి వ‌ద్ద నుంచీ ఒ ఐఫోన్,.75వేల న‌గ‌దు… టివిఎస్ ఎపాచి మోటారు సైకిల్ మరియు 2 తులాల బంగారుహారం స్వాధీనం చేసుకున్నారు.

ఈ మేర‌కు ఏఎస్పీ అనిల్  మాట్లాడుతూ…త‌మ‌. విచారణలో నిందితుడు ఈ నెల 11వ తేదీన విజయనగరం టూటౌన్ పోలీసు స్టేషను పరిధిలో జరిగిన చైన్ స్నేచింగ్ ను అత‌నే  చేసినట్లు ఒప్పుకోవ‌డం…, సదరు కేసులో ఫిర్యాది చెప్పిన నలుపు రంగు మోటారు సైకిల్ ఒకటే కావటంతో ఆ  నేరంలో 2 తులాల బంగారు హారం స్వాధీనం చేసుకొన్నట్లు   తెలిపారు.

కాగా నిందితుడు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ల‌కు అల‌వాడు ప‌డి… 80  వేలు పొగొట్టుకోవ‌డం…దీనికి తోడు జ‌ల్సాల‌కు అల‌వాటు ప‌డటం అలాగే అప్పులు చేయ‌డంతో వాటిని తీర్చ‌డం కోసం…చైన్ స్నేచింగ్ ల‌కు దిగాడ‌ని ఏఎస్పీ తెలిపారు.

అయితే డిగ్రీ సెకండ్ఇయ‌ర్ చ‌దువుతున్న నిందితుడు రాజేష్…విద్యార్ధి ద‌శ‌లోనే  జ‌ల్సాల‌కు అల‌వాటు ప‌డ‌టం..అందుకు అప్పులు చేయ‌డం..వాటిని తీర్చ‌డం  కోసం…దొంగ‌త‌నాలు చేయ‌డం దారుణ‌మ‌ని… క‌న్న‌వాళ్లు…త‌మ పిల్ల‌లు ఎక్క‌డికి వెళుతున్నారు..ఎవ‌రితో ప‌రిచ‌యాలు ఉన్నాయి… అలాంటి అంశాల‌పై నిరంతం ప‌రిశీలించాల్సిదేన‌ని ఏఎస్పీ  ఈ  సంద‌ర్బంగా తెలిపారు.

Related posts

50 లక్షలతో పట్టుబడ్డోడు నాపై పోటీ చేస్తాడట

Satyam NEWS

అయ్యప్ప దీక్ష చేపట్టిన గుజరాల ఎమ్మెల్యే కాసు మహేష్

Satyam NEWS

చంద్ర‌బాబుపై జ‌రిగిన దాడిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం

Satyam NEWS

Leave a Comment