31.2 C
Hyderabad
May 3, 2024 02: 37 AM
Slider ముఖ్యంశాలు

50 లక్షలతో పట్టుబడ్డోడు నాపై పోటీ చేస్తాడట

#kcrmeeting

కామారెడ్డి ప్రజా ఆశీర్వద సభలో సీఎం కేసీఆర్

తెలంగాణలో రాజకీయ అస్థిరత తేవడం కోసం ఎమ్మెల్యేను కొనుగోలు చేయాలని 50 లక్షలతో రెడ్ హేండెడ్ గా దొరికినోడు కామారెడ్డిలో నాపై పోటీ చేస్తాడట అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినుద్దేశించి సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న సందర్బంగా సీఎం కేసీఆర్ కామారెడ్డికి వచ్చి ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తన తల్లి పుట్టింది ఈ నియోజకవర్గంలోనేనని, తన బాల్యం కూడా ఇక్కడే సాగిందని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 45 రోజుల పాటు జలసాధన ఉద్యమం సాగిందని, నాడు మండలానికి ఒక బ్రిగేడియర్ ను నియమించుకుంటే తానే ఇక్కడ బ్రిగేడియర్ గా ఉన్నానన్నారు. కామారెడ్డి బార్ అసోసియేషన్ ఉద్యమానికి ఊపునిచ్చిందని తెలిపారు. కామారెడ్డికి కేసీఆర్ వస్తే వెంట చాలా వస్తాయని, కాళేశ్వరం 22 ప్యాకేజీ పనులు ఏడాదిన్నర రెండేళ్లలో పూర్తి చేసి కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పారిస్తానని హామీ ఇచ్చారు.

కేసీఆర్ వస్తే ఐటీ హబ్ లు వస్తాయని, విద్యుత్, ఎడ్యుకేషన్ సంస్థలు, పరిశ్రమలు వస్తాయన్నారు. కామారెడ్డి పట్టణ, పల్లెల రూపురేఖలు మారుస్తానని పేర్కొన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో రాజకీయ పరిణతి ఇంకా రాలేదన్నారు. ఎన్నికలప్పుడు అనేకమంది అభర్తులు పోటీలో ఉంటారని, ఆ నాయకుల గుణగణాలు, వెనక ఉన్న పార్టీల గురించి ఆలోచించి ఓటయ్యాలన్నారు.

గతంలో అధికారం ఇస్తే ఏం చేసాయి, ఇప్పుడిస్తే ఏం చేస్తాయో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. తాను గతంలో కార్మిక మంత్రిగా ఉన్నానని దేశంలోని 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉంటే ఏనాడైనా వారిగురించి పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. 2014 కటాఫ్ డేట్ ఎత్తివేసి మిగిలిన లక్ష మంది బీడీ కార్మికులకు కూడా పింఛన్ ఇస్తామని తెలిపారు.

సమైక్య రాష్ట్రంలో వ్యవసాయాన్ని నాశనం చేసారని, తెలంగాణ వచ్చాక కరెంట్ విషయంలో విజయం సాధించామని, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, రైతులకు సమయానికి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇస్తున్నామని, పెట్టుబడి కోసం రైతుబంధు సాయం చేస్తున్నామని, రైతు చనిపోతే 5 లక్షల భీమా ఇస్తున్నామని తెలిపారు. మాజీ పిసిసి అధ్యక్షుడు రైతుబంధు దుబారా అంటున్నారని, ప్రస్తుత పిసిసి చీఫ్ 3 గంటల కరెంట్ చాలని అంటున్నారన్నారు.

ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు మనకు కావాలా అని ప్రశ్నించారు. బోర్లకు మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి 5 వేల కోట్లు నిధులు కట్ చేస్తామని కేంద్రం బెదిరించిన మోటార్లకు మీటర్లు పెట్టలేదన్నారు. జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని చట్టంలో ఉన్నా ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదని, 100 లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు. తెలంగాణపై పగబట్టి ఒక్క మెడికల్ కళాశాల కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.

ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ నాయకుని నిలదీయాలని సూచించారు. ధరణి పోర్టల్ రద్దు చేస్తామని ఎద్దు, ఎవసం తెలియని రాహుల్ గాంధీ చెప్తున్నారని, ధరణి పోర్టల్ రద్దు చేస్తే మళ్ళీ విఆర్వో, గీర్దావర్ వ్యవస్థ వచ్చి రైతులు వాళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ధరనిని బంగాళాఖాతంలో పడేస్తామని చెప్పిన వాళ్లనే బంగాళా ఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ఇలాగే ఇబ్బందులు పెడితే కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని ఉద్యమాన్ని ఉదృతం చేస్తే తెలంగాణ ఇచ్చారన్నారు.

అలాంటి తెలంగాణలో రాజకీయ అస్థిరత తేవాలని ఎమ్మెల్యే కొనుగోలు చేయడానికి 50 లక్షలై ఇస్తూ రెడ్ హ్యాండేడ్ గా దిరికినోడు ఇవాళ నామీద పోటీ చేస్తాడట అని రేవంత్ రెడ్డినుద్దేశించి వ్యాఖ్యానించారు. ఇలాంటి దొంగలకు కామారెడ్డి ప్రజలు బుద్ది చెప్పాలన్నారు. రాష్ట్రంలో 7500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకుని 33 కోట్ల చేపలను తెలంగాణ నుంచి ఎగుమతి చేసుకుంటున్నామని తెలిపారు.

పదేళ్ళలో తెలంగాణలో ఒక్కరోజు కూడా కర్ఫ్యూ పెట్టుకోలేదని, ఒక్కరోజు కూడా కరువు రాలేదన్నారు. కలలో కూడా అనుకోని అనేక పథకాలు అమలు చేసుకున్నామని, 3 కోట్ల మందికి కంటివేలుగు ద్వారా పరీక్షలు చేసి 85 లక్షల మందికి కంటి అద్దాలు ఇచ్చామన్నారు. కామారెడ్డిలో అభివృద్ధి జరగడానికి అన్ని వనరులు ఉన్నాయని, రాష్ట్రంలోనే కామారెడ్డి ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి అవుతుందన్నారు. ఇక్కడి ప్రజలు దీవించాలని కోరారు. తాను ఇక్కడ పోటీ చేయడానికి గంప గోవర్ధన్ తన పదవిని త్యాగం చేసారని, ఆయన రాజకీయ భవిష్యత్తు బాధ్యత తనదేనన్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

సీఎం కేసీఆర్ కు స్వాగతం పలుకుతున్న గంప గోవర్ధన్

Related posts

అంబేద్కర్ చిత్రాన్ని అపహాస్యం చేసిన సాక్షి పై చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

భూకంపం: టర్కీ, సిరియాలో 4,500కి చేరిన మృతుల సంఖ్య

Bhavani

అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

Bhavani

Leave a Comment