28.7 C
Hyderabad
May 6, 2024 00: 54 AM
Slider విజయనగరం

ఈవ్ టీజింగ్ ఫిర్యాదుల‌పై పోలీస్ బాస్ అలెర్ట్

దిశ మొబైల్ వెహికిల్స్ తో విజయనగరం కాలేజీల వ‌ద్ద త‌నిఖీలు…!

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్ వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచీ మ‌హిళ‌ల‌పై ప్ర‌త్యేకించి అమ్మాయిల‌పై ఈవ్ టీజింగ్ కేసులు పెరుగుతున్నాయ‌న‌టానికి.. కొత్త‌గా దిశ మొబైల్ వెహికిల్స్ రావ‌డ‌మే అందుకు నిద‌ర్శ‌నం..జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిన మొద‌ట్లోనే విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రం బ్యారెక్స్ లో ఏకంగా దిశ పోలీస్ స్టేష‌న్ ను ఏర్పాటు చేసింది.

ఇక‌. అప్ప‌టి జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ హ‌యాంలో త‌ర‌చూ దిశ స్టేష‌న్ లో ప్ర‌తీ రోజు వ‌చ్చే ఫిర్యాదుల‌పై స‌మీక్ష నిర్వ‌హించేవారు. ఆ ఎస్పీ ఆదేశాల‌తో ఎస్ఈబీ అద‌న‌పు ఎస్పీ శ్రీదేవి కూడా కొన్ని కేసుల‌ను ద‌గ్గ‌రుండీ చూసేవారు. ఇక త‌ర్వాత స్టేష‌న్ కు ప్ర‌త్యేకంగా ఒక డీఎస్పీ…ఒక‌సీఐ…ముగ్గురు ఎస్ఐలతో మ‌హిళ‌ల‌పైన అమ్మాయిల‌పైనే ప్ర‌త్యేకించి పొకిరీల ఆగ‌డాల‌ను అరిక‌ట్టేందుకు చ‌ర్య‌లు తీసుకునే వారు. ఆమ‌ధ్యనే హాక్ వెహిక‌ల్స్ ద్వారా న‌గరంలోనిఅన్ని కాలేజీల వ‌ద్ద ఈవె టీజింగ్ ను నియంత్రించేందుకు మహిళా పోలీ\సులతో అలెర్ట్ చేసారు. ఆ వెహికిల్స్ స్థానంలో దిశ మొబైల్ వెహికిల్స్ రావ‌డంతోన‌గరంలోని ఎస్బీ బంగ్లా స‌మీపంలోని శ్రీనివాస కాలేజీ జంక్ష‌న్,అలాగే తోట‌పాలెం గాయిత్రీ కాలేజీ జంక్ష‌న్ వ‌ద్ద ఈ దిశ మొబైల్ వెహిక‌ల్స్ తో…పోకిరీల ఆగ‌డాల‌ను మ‌హిళా పోలీసుల‌తో అరిక‌డుతోంది…జిల్లా పోలీస్ శాఖ‌.

ఈ మేర‌కు ఆ దిశ మొబైల్ వెహికిల్ లో కానిస్టేబుల్ తో పాటు మ‌హిళా పీసీ కూడా..న‌గ‌రంలోని అన్ని కాలేజీల వ‌ద్ద‌కు వెళ్లి…అక్క‌డి అమ్మాయిల‌కు దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని…ఆప‌ద‌, అత్య‌వ‌స‌ర‌స‌మ‌యంలో 100 నెంబ‌ర్ కు ఫోన్ చేయాల‌ని చైత‌న్యం ప‌రుస్తున్నారు ఏదైనా జిల్లా ఎస్పీ దీపిక ఆదేశాల‌తో దిశ మొబైల్ సిబ్బంది… ఆ ర‌క‌మైన చైత‌న్యాన్ని కాలేజీల వ‌ద్ద అటు అమ్మాయిల‌లో క‌ల్పించ‌డంలో కాస్త క‌ష్ట‌ప‌డుతున్నార‌నే అని అంటోంది..స‌త్యం న్యూస్.నెట్

Related posts

కరోనా క్లీనిక్: మాధ్యమాలకు బాధ్యత ఎక్కువ

Satyam NEWS

ప్రియుడి దాష్టీకం నుంచి యువతిని కాపాడిన పోలీసులు

Bhavani

మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు

Satyam NEWS

Leave a Comment