31.7 C
Hyderabad
May 7, 2024 02: 50 AM
Slider విజయనగరం

ప్ర‌జ‌లను అలెర్ట్ చేస్తున్న విజయనగరం పోలీసులు

#rajakumariIPS

క‌రోన సెకండ్ వేవ్ కారణంగా  విజ‌య‌న‌గ‌రం  జిల్లాలో కేసులు పెరుగుతున్న ద‌ర‌మిలా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ రోజు నుంచీ 18 గంట‌ల పాటు లాక్ డౌన్ అమ‌లు చేయాల‌న్న ఉత్త‌ర్వులు గత రాత్రే వెలువ‌డ్డాయి. ఈ మేర‌కు అన్ని  జిల్లాల ఎస్పీలు అలెర్ట్ అయ్యారు.

అందులో భాగంగా జిల్లా రాజ‌కుమారీ కూడా త‌న సిబ్బందిని మేన్ ప్యాక్,సెట్ కాన్ఫ‌రెన్స్ ద్వారా అలెర్ట్ చేయ‌స్తున్నారు. అందులో భాగంగా ఎస్పీ  ఆదేశాల మేర‌కు పార్వతీపురం సీఐ లక్ష్మణరావు ఆధ్వర్యంలో పట్టణ పోలీసులు ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయించారు. ప‌ట్ట‌ణంలో ఎక్కువగా గుమిగూడిన ప్రాంతాల్లో కరోనా  వైరస్ వ్యాప్తి  పట్ల అవగాహన కల్పించారు.  ప్రతీ ఒక్కరూ డబుల్ మాస్క్ ధరించి రక్షణ పొందాలని, క‌రోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

అదే విధంగా అదే డివిజ‌న్ కురుపాం పోలీస్ స్టేష‌న్ ఎస్ఐ రవి, త‌న సిబ్బందితో మునిగూడ జంక్షన్ వద్ద ప్రజలకు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, ప్రతీ ఒక్కరూ క‌రోనా నిబంధనలు పాటించాలని కోరారు.అలాగే బొబ్బిలి పోలీస్ స్టేష‌న్ఎస్ఐ ప్రసాద్,త‌న‌ సిబ్బంది తో క‌లిసి ప్రజలకు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.

అలాగే  రామ‌భ‌ద్ర‌ పురం పోలీసులు ప్రజలకు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్క్ ధరించాలి అని కోరారు అదే విధంగా  జియ్యమ్మవలస ఎస్ఐ రాజేష్, కూడ త‌న సిబ్బందితో ప్రజలకు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

బోగాపురం సర్కిల్ ప‌రిధిల్ ప‌రిధిలో ఖాకీలు చేసిన ప‌ని ఇది…!

క‌రోనా కేసులు తెగ విజృంభిస్తున్న వేళ భోగాపురం స‌ర్కిల్ ప‌రిది లో మూడు పోలీస్ స్టేష‌న్ ల \సిబ్బంది లాఠీలకు ప‌ని చెప్ప‌డం మానేసి..నోటికి  ప‌ని చెప్పే ప‌నిలో ప‌డ్డారు. క‌రోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న ద‌రిమిలా  ప్ర‌జ‌లంద‌రూ క‌నీస జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. అయితే క‌రోనా మూలంగా ఈ మ‌ధ్య‌నే పూస‌పాటి రేగ్ ఎస్ఐ జయంతి హోం ఐసోలేష‌న్ లో ఉన్నారు.

పూర్తిగా కొలుకున్నార‌ని తెలుసుకున్న విజ‌య‌న‌గ‌రం డీఎస్పీ అనిల్..స్వ‌యంగా పూస‌పాటిరేగ వెళ్లి ఎస్ఐ జ‌యంతికి పుష్ప‌గుచ్చం ఇచ్చి అభినందించారు.దీంతో అప్ప‌టి నుంచీ  ఎస్ఐ జ‌యంతి విధుల‌కు హాజ‌ర‌వుతూ క‌రోనా ప‌ట్ల ప్ర‌జ‌లు తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌ల గురించి తెలియ ప‌రుస్తున్నారు.

ఈ మేర‌కు ఎస్ఐ జ‌యంతి త‌న సిబ్బందితో  వాహనదారులకు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్త‌లు వివ‌రించారు. క‌రోనా  నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించారు. అదే విధంగా డెంకాడ  పోలీస్ స్టేష‌న్  ఎస్ఐ సాగర్ బాబు,త‌న సిబ్బందితో  సిబ్బంది జొన్నాడ వద్ద ప్రజలు, వాహనదారులకు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.,

ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. అదే ఇటు గ‌జ‌ప‌తి న‌గ‌రం  స‌మీపం  మానాపురం రహదారిపై ఆ స్టేష‌న్ ఎస్ఐ రమేష్ నాయుడు  త‌న‌ సిబ్బందితో  ప్రజలు, వాహనదారులకు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.ఆ త‌ర్వాత  శానిటైజర్స్, మాస్క్ లను అందజేశారు.

Related posts

శాసనసభ్యునికి వినతిపత్రం అందజేసిన గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు

Satyam NEWS

రియల్లీ:కోవిడ్ అంత ప్రమాదకరం కాదట

Satyam NEWS

స్మశానాలకు ఉచితంగా సుమారు వెయ్యి టన్నుల కలప

Satyam NEWS

Leave a Comment