38.2 C
Hyderabad
May 3, 2024 19: 43 PM
Slider నల్గొండ

శాసనసభ్యునికి వినతిపత్రం అందజేసిన గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు

#saidireddy

తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్ లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి కి  ఫీల్డ్ అసిస్టెంట్లు మెమోరండం సమర్పించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ లను నిర్ధాక్షిణ్యంగా తొలగించటం సరైంది కాదని డిమాండ్ చేస్తూ ఫీల్డ్ అసిస్టెంట్ల ఆధ్వర్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గ ఫీల్డ్ అసిస్టెంట్లు శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి కి క్యాంపు కార్యాలయంలో మెమోరండం అందజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోసన బోయిన హుస్సేన్ మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకంలో పనిచేసి ప్రజలకు సేవ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయస్థాయిలో అవార్డు తీసుకొచ్చారని అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనం,డంపింగ్ యార్డ్ హరితహారం,మరుగుదొడ్ల నిర్మాణం,ఇంకుడు గుంతల నిర్మాణం,వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 47 79 వలన ఫీల్డ్ అసిస్టెంట్ల జీవిత మనుగడకు ప్రమాదం ఉందని అన్నారు.దీనికి వ్యతిరేకంగా తాము నిరసన వ్యక్తం చేశారని,అందు కొరకే ప్రభుత్వ ఫీల్డ్ అసిస్టెంట్ లను ఉద్యోగం నుండి  తొలగించిందని అన్నారు.

రెండు సంవత్సరాలుగా ఎంతో ఇబ్బంది పడుతున్నామని, అందరూ ఎస్సీ ఎస్టీ బిసి అగ్రవర్ణ పేదల మైన తమకు న్యాయం చేయాలని,వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్లుగా కొనసాగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి బాల సైదులు,రవిబాబు, వెంకన్న,శైలజ,వెంకట రెడ్డి,బాలు నాయక్,నాగయ్య,సుధాకర్,బిక్షం, వెంకన్న,బోయి.శీను,అరుంధతి, నాగలక్ష్మి,చంద్రకళ,వెంకట్,లక్ష్మి,అనిత తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

అనధికార బ్లాస్టింగ్ లు ఆపాల్సిందే లేకుంటే చర్యలు తప్పవు

Satyam NEWS

రాజ్యాంగాన్ని అవమానించే వారిని తరిమికొట్టండి

Satyam NEWS

రాజకీయ పార్టీలు మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టవద్దు

Satyam NEWS

Leave a Comment