33.2 C
Hyderabad
May 3, 2024 23: 48 PM
Slider విజయనగరం

అక్కడ ముగ్గురు ట్రాఫిక్ ఎస్ఐ లకు ఒకే ఒక్క జీపు డ్రైవర్..!

#traficpolice

డీజీపీ సారూ జర చూడండని అంటోంది “సత్యం న్యూస్. నెట్”.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ తో జిల్లా ల విభజన చేసిందే గాని… ప్రభుత్వం లో పని చేసే ఉద్యోగులు..అందునా అహర్నిశలు ప్రజల కోసం పని చేసే పోలీసులు పరిస్థితి కాస్త పక్కన పెట్టిందనే అని అంటోంది సత్యం న్యూస్. నెట్. ప్రస్తుతం కొత్త జిల్లాలకు రెవెన్యూ, పోలీసు యంత్రాంగం లో పని అంతంత మాత్రమే జరుగుతోందని చెప్పకతప్పదు.ముఖ్యంగా కొత్త జిల్లా ల సంగతి పక్కన పెడితే ఉన్న పాత జిల్లాలో ఉద్యోగం పరిస్థితి అందున పోలీసులు ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.

ముఖ్యంగా పోలీసు శాఖలో అప్పటి బ్రిటిష్ విధానాలనే శాఖలో కొంతమంది పోలీసు అధికారులు అవలంబిస్తున్నారు.పర్యవసనంగా దిగువన ఉన్న సిబ్బంది అయిన కానిస్టేబుల్.. హోం గార్డ్ లు మింగ లేక కక్క లేక చివరకు జీతం కోసమే అన్నట్టు గా వాళ్ళ వృత్తి మారింది. అందుకు విజయనగరం జిల్లా నే అందుకు ఉదాహరణ. పార్వతీ పురం మన్యం జిల్లా గా కొత్త ది ఆవిర్భవించడంతో పాత విజయనగరం జిల్లాలో సగం పోలీసు సిబ్బంది ఆ జిల్లా కు బదిలీ అయ్యారు.

అయితే కొత్తగా జిల్లా ఏర్పాటు అయ్యిందే గాని పోలీసు శాఖ లో అటు సీనియర్ ఆఫీసర్లకు వాహనాలు.. సిబ్బంది అవసరం మాత్రం ఏర్పాటు చేయడం లో రాష్ట్ర పోలీసు శాఖ…తెగ అవస్థలు పడుతోంది. ఈ క్రమంలో విజయనగరం జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ విభానికి సంబంధించి ముగ్గురు ఎస్ఐ లు ఉన్నా…ఒకే ఒక్క వాహనం ఉండటం విశేషం. అలాగే . ఆ ముగ్గురు ఎస్ఐలకు ఒకే ఒక్క జీపు డ్రైవర్ ను కేటాయించడం విడ్డూరం. మొన్నటి వరకు… రెండు జీపులు ట్రాఫిక్ వింగ్ కు ఉండటం. .ముగ్గురు లో ఒక ఎస్ఐకు వీక్లీ ఆఫో..లేక కోర్ట్ పనో లేక వారంట్ కోసమే వెళితే.. మిగిలిన ఇద్దరు ట్రాఫిక్ ఎస్ఐలకు రెండు జీపులను కేటాయించడంతో నగరం మొత్తం అటు ట్రాఫిక్ ను క్రమబధ్ధీ కరించడం..ఇటి డీడీ ,ఫైన్ లు వేయడం జరుగుతూ ఉండేది.

ప్రస్తుతం ముగ్గురు ఎస్ఐ లు విధుల్లో ఉన్న..ఒకే ఒక్క జీపు…ఒకేఒక్క డ్రైవర్… అదీ హోంగార్డ్ తో నెట్టుకుంటూ వస్తోంది.. ట్రాఫిక్ వింగ్ . ఉన్న రెండు జీపు లలో ఒక జీపు ను పార్వతీ పురం మన్యం జిల్లా కు పంపించడంతో మిగిలిన ఒక్క జీపు తో ఉన్న ముగ్గురు ట్రాఫిక్ ఎస్ఐ లు..ఒకే ఒక్క డ్రైవర్ తో విధులు నిర్వహిస్తున్నారు.. ఈ పరిస్థితి సత్యం న్యూస్. నెట్. శోధించి… రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచే యత్నం చేస్తోంది.. మరి జగన్ ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటుందో లేక..పోలీసు శాఖ కు ఇటీవలే కొత్త గా వచ్చి డీజీపీ..తమ శాఖ కు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలని అంటోంది సత్యం న్యూస్. నెట్.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

Satyam NEWS

ఏపిలో పెరిగిపోతున్న రాజ్య హింస

Satyam NEWS

15న టి‌ఆర్‌ఎస్ కీలక సమావేశం

Murali Krishna

Leave a Comment