34.7 C
Hyderabad
May 4, 2024 23: 18 PM
Slider గుంటూరు

ఆంగ్ల అధ్యాపకురాలు డాక్టర్ కొణిజేటి అరుణకుమారికి “విశ్వజననీ విద్యారత్న”

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని శ్రీరస్తు కన్వెన్షన్ హాల్లో విశ్వజననీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఆత్మీయ సమావేశంలో శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలకు చెందిన ఆంగ్ల అధ్యాపకురాలుగా పనిచేస్తున్న డాక్టర్ కొణిజేటి అరుణకుమారి విద్యా రత్న అవార్డు అందుకోవడం జరిగింది. ఈ అవార్డులు, కార్యక్రమానికి విశ్వ జననీ ఫౌండేషన్ ఫౌండర్ అయిన బొగ్గారపు బ్రహ్మానందం అధ్యక్షత వహించగా స్థానిక నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి అవార్డుల ప్రధానం చేయడం జరిగింది. తొలుత ఈ

కార్యక్రమానికి సభా ప్రారంభకులుగా (ప్రవళిక సత్యం) బచ్చు వెంకట సత్యనారాయణ ( వి ఎస్ పి) కొత్త సాంబ శివరావులు నిర్వర్తించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విద్యా రత్న అవార్డు గ్రహీత డాక్టర్ కొణిజేటి అరుణ కుమారి ట్లాడుతూ తాను ఆంగ్ల అధ్యపకురాలుగా గత 25 సంవత్సరాలుగా విద్యారంగ సేవలు అందిస్తున్నానని విశ్వజననీ ఫౌండేషన్ ఫౌండర్ బొగ్గారపు బ్రహ్మానందం మరియు కమిటీ తనను గుర్తించి ఈ అవార్డును ప్రధానం చేసినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కళాశాల సెక్రటరీ నాగసరపు సుబ్బరాయ గుప్త, ప్రెసిడెంట్ కపిలవాయి విజయ్ కుమార్ లకు కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారి ఆశీస్సులు సహాయ సహకారాలు అందజేస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా విశ్వజనని ఫౌండేషన్ విద్యా రత్న అవార్డును అందించిన ఫౌండర్ బొగ్గారపు బ్రహ్మానందంలకు కమిటీకి తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంగరంగ వైభవంగా అత్యంత ఘనంగా జరిగిన ఈ వేడుకల్లో సినీ ఆర్టిస్ట్ గీతా సింగ్ జబర్దస్త్ అప్పారావు తెలంగాణ మా అసోసియేషన్ కిరణ్ కుమార్ నిడమానూరు సురేంద్ర మాజేటి సాంబశివరావు కొత్తూరు కిషోర్ బాబు ప్రవళిక సత్యం చింతా కిరణ్ కుమార్ బత్తుల మురళి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ములుగు ప్రాంత కరోనా బాధితులకు ఉచిత కౌన్సిలింగ్

Satyam NEWS

ఎన్నికల ప్రచారానికి కర్ణాటక బీజేపీ నేతలు

Bhavani

ప్రభుత్వ నిర్లక్ష్యంపై కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ నిరసన

Satyam NEWS

Leave a Comment