38.2 C
Hyderabad
May 2, 2024 19: 13 PM
Slider హైదరాబాద్

ప్రభుత్వ నిర్లక్ష్యంపై కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ నిరసన

#Kukatpally Press Club

అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని తెలంగాణా రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం  (ఐజేయూ) కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భూమి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టీయూడబ్ల్యుజె (ఐజేయూ)  రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు భూమి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేపిహెచ్ బికాలనీ మెయిన్ రోడ్డు వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు సర్కార్ వైఖరి పట్ల తమ నిరసన తెలిపారు. నల్ల మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ తెలంగాణ అమరులకు, కరోనా మహమ్మరి కి బలైన ప్రజలకు జర్నలిస్టులు  నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భూమి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో జర్నలిస్టుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని, స్వరాష్ట్ర సాధనకై తెగించి  పోరాడిన  జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా పాలకులు  మాయమాటలు చెప్పి మభ్యపెడుతున్నారని విమర్శించారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లు, హెల్త్ కార్డులు, పని చేస్తున్న ప్రతి విలేకరికి అక్రిడిటేషన్ కార్డులు, ఇన్సూరెన్స్ ఇస్తామని ఎన్నికల మేనిపిస్టో లో  హామీలిచ్చి వాటిలో ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. అనేక ప్రాంతాల్లో జర్నలిస్టులపై అధికార పార్టీ నాయకులు దాడులు చేస్తున్నా ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.

జర్నలిస్టులకు రక్షణ కల్పించడంలో సర్కార్ పూర్తిగా విఫలం చెందిందని  దీనిని ప్రజా సామ్యవాదులంతా ఖండించాలని కోరారు. కరోనా లాక్ డౌన్ తో వేలాది మంది విలేకరులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ఆదుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భూమి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.

బంగారు తెలంగాణా లో పోరాటాలతో జర్నలిస్టులు తమ హక్కులను సాధించుకోవాలనుకోవడం దురదుష్ట కరం. ఇకనైనా ప్రభుత్వం ఎన్నికల మేనిపిస్టో లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతారని ఆశిస్తున్నాము.  జర్నలిస్టు ఎదుర్కొనే సమస్యలపై టీయూడబ్ల్యుజె (ఐజేయూ) అండగా నిలుస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లక్ష్మణ్ ప్రసాద్, దామోదర్, నరసింహా, కిరణ్, నమాల శ్రీధర్, L. శ్రీనివాసరెడ్డి ,రమణ, వసంత్, బొమ్మా గోపి, మున్నూరు రాకేష్,  జాషువా, సైదులు, కిషోర్ చారి,రాజు, నర్సింహ, క్రాంతి కుమార్, శంకర్, బాషా, నగేష్,శ్రీనివాస్. లు పాల్గొన్నారు.

Related posts

సామాన్యుడి కోసం తప్ప స్నేహితుల కోసం కాదు

Satyam NEWS

హిందూపూర్ 1 వ పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ

Bhavani

14 న రిలీజ్ అవుతున్న కె జి ఎఫ్ రాక్ స్టార్ యాష్ ‘‘రారాజు’’

Satyam NEWS

Leave a Comment