29.7 C
Hyderabad
May 4, 2024 06: 19 AM
Slider వరంగల్

ములుగు ప్రాంత కరోనా బాధితులకు ఉచిత కౌన్సిలింగ్

#App

కరోనా బాధితులకు ఉచితంగా కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్టు మండలంలోని జంగాలపల్లి గ్రామానికి చెందిన మాస్టర్ ట్రైలర్  కుక్కల రోహిత్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

సర్వ్ ద నేషన్ యాప్ ద్వారా కరోనా బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు  కౌన్సిలింగ్ & ట్రైనింగ్  ఇవ్వనున్నట్లు తెలిపారు.

అయితే కౌన్సిలింగ్ తీసుకునేవారు (Serve the nation) అనే యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా  డౌన్లోడ్ చేసుకొని కౌన్సిలింగ్ అనే ఆప్షన్ మీద  క్లిక్ చేస్తే ఒక గూగుల్ ఫామ్ వస్తుంది.

దానిని ఫిల్ చేసి  రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి  కరోనా నుండి ఎలా జయించాలో, కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తి  కౌన్సిలింగ్& ట్రైనింగ్ ఇస్తారు.

మరిన్ని వివరాలకు టీం లోని ఎస్. బిక్షపతి (8096016520), పి.శివకుమార్ (7981024202), పి.రంజిత్ కుమార్ (9666763391), పి.నిఖిల్ రెడ్డి (7036650394) లను సంప్రదించవచ్చు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Related posts

హుజూర్ నగర్ లో ఘనంగా గుర్రం జాషువా 50వ వర్ధంతి

Satyam NEWS

ఆడపడుచులూ బతుకమ్మ చీరెలు వచ్చేశాయి

Satyam NEWS

ట్రాన్స్ఫర్: టీచర్ గంగయ్య సేవలు ప్రశంసనీయం

Satyam NEWS

Leave a Comment