40.2 C
Hyderabad
May 5, 2024 15: 26 PM
Slider నెల్లూరు

మెట్ట ప్రాంతాలకు నీళ్లిచ్చిన దాత విపిఆర్

#VPR

పెట్ట ప్రాంతాలైన ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాలకు నీళ్లు ఇచ్చిన దాత, రాజ్యసభ సభ్యులు
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. నెల్లూరు సర్వజన వైద్యశాల (పెద్ద ఆసుపత్రి) లో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మూడు ఆర్వో ప్లాంట్లకు రాజ్యసభ సభ్యులు విపిఆర్ తో కలిసి శనివారం ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్ద ఆస్పత్రిలో 3 నీటి ప్లాంట్లు ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది జిల్లా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఆసుపత్రి అని తెలిపారు. ఏపీఆర్ మృదుస్వభావి, దాత అని కొనియాడారు.100కు పైగా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసి జిల్లా వాసులకు ఎంతగానో సహాయపడ్డారని అభినందించారు. ఇంతటి మంచి వ్యక్తికి ఆయురారోగ్యాలు చేకూరాలని కోరారు.

ఆయన మరింతగా జిల్లా వాసులకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వాసులందరికీ, ముఖ్యంగా నగరంలో ఉన్న పెద్ద ఆసుపత్రికి ఈ సౌకర్యాన్ని కల్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, జిల్లా కలెక్టర్ హరినారాయణన్, నెల్లూరు నగర ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, చిరంజీవి రెడ్డి, మల్లు సుధాకర్ రెడ్డి, ఆసుపత్రి సూపర్నెంట్, డాక్టర్లు, కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, ఆస్పత్రి సిబ్బంది పలువురు పాల్గొన్నారు.

Related posts

ఛీటింగ్: బాపట్ల ఎంపి సురేష్ పేరుతో భూ దందా

Satyam NEWS

సంప్రదాయ వేషాలతో పైడితల్లి తొలేళ్లు…

Satyam NEWS

సోషల్ మీడియాలో పెయిడ్ వర్కర్లు లేరు

Satyam NEWS

Leave a Comment