23.7 C
Hyderabad
May 8, 2024 06: 37 AM
Slider ముఖ్యంశాలు

సంప్రదాయ వేషాలతో పైడితల్లి తొలేళ్లు…

#jatara

గడచిన రెండేళ్లుగా ఉత్తరాంధ్ర కల్పవల్లి… విజయనగరం ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ పైడితల్లి ఉత్సవం…కరోనా కారణం గా జరగలేదన్న విషయం వీక్షకులకు తెలిసిందే. ప్రస్తుతం ఈ ఏడాది లో వైభవంగా శ్రీశ్రీశ్రీ పైడితల్లి సిరిమాను సంబరం మొదలయ్యింది. గతేడాది తూతూ మంత్రంగా కేవలం జరిపించాం అన్న చందంగా జరిగిన సిరిమాను సంబరం.ఈ ఏడాది అత్యంత వైభవంగా అడ్డంకులు ఏవీ లేకపోవడంతో… భక్తులు తండోపతండాలుగా రావడం మొదలెట్టారు..తొలేళ్లు సంబరం…పులివేషాలు…కోలాటాలు.. డప్పు.. కోలాహలం గా తయారైంది.

దాదాపు 3 వేల మంది పోలీసు సిబ్బంది తో ఎస్పీ అత్యంత పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే సిబ్బంది నిర్వహిస్తున్న బందోబస్తు ను అలాగే తొలేళ్ల సందర్భంగా భక్తుల సందడి ని…స్వయంగా చూసేందుకు ఎస్పీ దీపికా రాత్రి పదిగంటల ప్రాంతంలో నగరంలో ని మూడులాంతర్ల వద్ద ఉన్న అమ్మవారి గుడికి వచ్చి.. బందోబస్తు ను దగ్గరుండి పరిశీలించారు. ఎస్సీ ,ఎస్టీ డీఎస్పీ శ్రీనివాసరావు…వన్ టౌన్ సీఐ వెంకటరావు…మరో సీఐ అప్పలనాయుడు…. మేడం కు బందోబస్తు గురించి భక్తుల రద్దీ గురించి వివరించారు. దాదాపు గంటన్నర కు పైగా అక్కడే ఉండి పరిస్థితి ని పరిశీలించి… అక్కడ నుంచీ నిష్రమించారు.

Related posts

మట్టపల్లి మహా క్షేత్రంలో నూతన ఆంగ్ల క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

తెలంగాణ మిడ్ వైఫరీ వ్యవస్థకు ఐక్యరాజ్యసమితి ప్రశంసలు

Satyam NEWS

పల్లె, పట్టణ ప్రగతి పథకాలతో ‘చివరి మజిలీ’కి తీరిన చింత

Satyam NEWS

Leave a Comment