స్కూల్ పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లను నేర్పడంలో భాగంగా కొల్లాపూర్ లోని గ్రీన్ ల్యాండ్ పాఠశాలలో మొదటిసారిగా వాటర్ బెల్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రతిరోజు ఇలా నిర్ణీత సమయానికి నీరు త్రాగడం వలన పిల్లలలో రక్త ప్రసరణ, జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. అదేవిధంగా అనారోగ్యాలకు కూడా చెక్ పెట్టవచ్చు.
ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తున్న ఈ వాటర్ బెల్ పద్ధతిని ప్రతిరోజు కనీసం 4,5 సార్లు నీళ్ళు తాగడానికి సమయం కేటాయించడం జరిగింది. ఈ వాటర్ బెల్ కార్యక్రమం వలన విద్యార్థులు డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటారు.
పిల్లల్లో ఒత్తిడిని కూడా తగ్గించవచ్చు. ఈ వాటర్ బెల్ కార్యక్రమాన్ని స్కూల్ కరస్పాండెంట్ E.వెంకటేష్, K.నరేష్, D. కుమార స్వామి, శంకర్ ప్రారంభించారు. ఇలా వాటర్ బెల్ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.