29.7 C
Hyderabad
May 4, 2024 05: 17 AM
Slider పశ్చిమగోదావరి

Danger level: వరద భయంతో…..గుట్టలపై గుడారాలు

#polavaram

పోలవరం నిర్వాసితుల పరిస్థితి ముందు గొయ్యి, వెనుక నుయ్యి అన్న చందంలా ఉన్నది. ప్రస్తుతం కొవిడ్ వైరస్ ముంపు మండలాలపై విజృంభిస్తూ ఇప్పటికే కేసులు పెరిగి, మరణాల సంఖ్య పదుల సంఖ్యలో ఉన్నాయి. మరో వైపు గోదావరి వరదలు ముంచెత్తడానికి సిద్ధంగా సన్నద్ధమవుతున్నాయి.

పోలవరం దగ్గర ప్రాజెక్టు గేట్లు దించడంతో గోదావరి నీరంతా వెనక్కి వస్తుంది. దేనితో తూర్పు, పచ్చిమ గోదావరి జిల్లాల గ్రామాలు గోదావరి తీరం ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశాలు ముందస్తుగానే కనిపిస్తున్నాయి. ఎటు వెళ్లాలో తెలియక నిర్వశిత ప్రజలు తర్జన భర్జన పడుతున్నారు. గత సంవత్సార వరదలకంటే ఈ సారి వరద ఉధృతి ఎక్కువగానే కనిపించే అవకాశాలున్నట్లు ముంపు మండలాల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో నిర్వశితప్రజాలు మరింత ఆందోళనకు గురౌతున్నారు. ఈ సారి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ముందస్తుగా అసలు ఆ ఊసైనా ఉందా అని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రజలను అప్రమత్తం చెయ్యడానికి  లాంచీలు సంసిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే వాటి కెపాసిటికి తగ్గట్లు గా ప్రజలను చేరవేయడానికి అనుకూలంగా లేనట్లు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి .

ఆ లాంచీలు మంచిగా లేకే అన్ని మరమ్మత్తులు చేయాలని ప్రభుత్వం పర్యటకానికి కూడా అనుమతులు ఇవ్వని పరిస్థితి ఉన్నది. ఏది ఏమైనా వరదల సమయంలో నిర్వాసిత బాధితుల పట్ల  ప్రభుత్వం  ఎంత వరుకు భాజ్యతగా ఉందొ తెలియడం లేదని ముంపు ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. వి.అర్.పురం మండల ప్రజలు వారి గ్రామాలు ముంపుకు గురయ్యినప్పుడు అందరూ రేఖపల్లి వెళ్లి అక్కడ తలదాచుకునే వారు. ఈ సారి ఆ రేఖపల్లి కూడా ముంపుకు గురయ్యిద్ధి అని కొందరు ఆరోపిస్తున్నారు.

బ్యారేజి అడ్డు కట్టతో గోదావరి  వెనక్కి, నీరు నిల్వ

మొన్నటి వరకు పాపికొండల ప్రాంతం నుండి వి.అర్.పురం మండలం వరుకు గోదావరి తీర ప్రాంతంలో  ఇసుక తిన్నెలు దర్శన మిచ్చాయి. కానీ ఎప్పుడైతే బ్యారేజి వద్ద గేట్లు అడ్డువేయ్యడంతో, కాపర్ డ్యాం అడ్డుతో తూర్పుగా ప్రవహించే వలసిన గోదావరి నీరు వెనక్కి మళ్ళీ గోదావరి నీరు పోటు ఏర్పడ్డది.  నీరంతా నిల్వ ఉండటం కనిపిస్తుంది. 

అయితే తీర ప్రాంతాల్లో గోదావరి నదికి ఆనుకొని ఉన్న ఉభయ గోదావరి జిల్లా గ్రామాల ప్రజలు ఆగిపోయిన నీరు తాగే పరిస్థితి ఉన్నది. అలా నిల్వ ఉన్న నీరుని తాగితే జబ్బులు ఏమైనా వస్తాయా అని ఆందోళనలు చెందుతున్నారు.

Related posts

ఆర్.ఎం.పి,పి.ఎం.పి,గ్రామీణ వైద్యుల వ్యవస్థకు న్యాయం చేయండి

Satyam NEWS

దళితులపై ప్రభుత్వం పక్షపాత వైఖరి వీడాలి

Satyam NEWS

సమంత ‘యశోద’ చిత్రానికి పాన్ ఇండియా హీరోల సపోర్ట్!

Bhavani

Leave a Comment