Slider ఖమ్మం

రైతులు పండించిన ప్రతి గింజను కొంటాం

#Puvvada Ajay Kumar

దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాల్సిన బాధ్యత మనదే అని, రైతులకు ముఖ్యమంత్రి కేసీఅర్ ఎప్పుడూ అండగా ఉంటారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.మార్క్ ఫెడ్ అధ్వర్యంలో చింతకాని మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పువ్వాడ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన పంట నష్టపోకుండా ఉండేందుకు, రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని అందుకే అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం కొంటామని ముఖ్యమంత్రి కేసీఅర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

ప్రభుత్వమే రైతు సంక్షేమ ప్రభుత్వం అని, వ్యవసాయాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపిన ఒకే ఒక వ్యక్తి కేసీఅర్ అని ఏ ఒక్క రైతు నష్టపోకుండా ప్రభుత్వమే మొక్క జాన్నలను కొనాలను ముఖ్యమంత్రి కేసీఅర్ నిర్ణయించారని పేర్కొన్నారు.వరి తో పాటుగా మొక్కజొన్న సాగు కూడా లాభసాటి గా ఉందని, మొక్కజొన్న ను కోళ్ల పరిశ్రమ, బిస్కెట్ తయారీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు.

Related posts

రూ.2 కోట్ల ‌ రోడ్డు ప‌నులు, పార్క్ ల‌ను ప్రారంభించిన మంత్రులు

Satyam NEWS

నరసరావుపేటలో కొప్పరపు కవుల విగ్రహ ప్రతిష్ట

Satyam NEWS

6129 కొనుగోలు కేంద్రాల ద్వారా 26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

Satyam NEWS

Leave a Comment