28.7 C
Hyderabad
May 6, 2024 07: 38 AM
Slider ఖమ్మం

జెండా కప్పుకుంటేనే సంక్షేమ పథకాల…!

#Welfare schemes

పాలేరు శాసన సభ్యుడు కందాళ ఉపేందర్రెడ్డి డబ్బుంటే ఏదైనా చేయవచ్చునని భావిస్తున్నాడని ఇది తగదని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ అన్నారు. గులాబీ జెండాలు కప్పుకుంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని చెప్పటం స్వార్ధ రాజకీయాలకు పరాకాష్ట అన్నారు.

ఖమ్మం సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని కందాళ ఇప్పుడు సిపిఐ కార్యకర్తలను వంచించేందుకు ప్రయత్నం చేస్తున్నాడని సిమెంటు రోడ్లు ఇస్తాం, డ్రైన్లు ఇస్తామంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆయన జిమ్మిక్కులు సిపిఐ ముందు పనిచేయవన్నారు.

దళితబంధు, గృహలక్ష్మి, బిసి బంధు కావాలంటే బిఆర్ఎస్ జెండా కప్పుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని ప్రభుత్వ పథకాలు ఉపేందర్ రెడ్డి ఇంట్లో సొమ్ముతో ఇవ్వటం లేదని అది ప్రజల సొత్తు అని సురేష్ తెలిపారు. డబ్బు రాజకీయాలు ఎల్లకాలం నడవవన్న సంగతి కందాళ గుర్తుంచుకుంటే మంచిదన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్దినేని కర్ణకుమార్, జిల్లా నాయకులు పుచ్చకాయల కమలాకర్, హనుమంతు రాము, సర్పంచ్ కూరుగంటి సంగయ్య, నాయకులు బద్దం భద్రారెడ్డి, సీతారాములు, వేముల వెంకటేశ్వర్లు, ఎస్కె నూర్గా జిలానీ, బత్తుల వెంకన్న, పుల్లయ్య, ఉపేందర్, వెంకన్న, ఎస్ కె బడేషా తదితరులు పాల్గొన్నారు.

Related posts

కళ్ల కలక ఇన్ఫెక్షన్ విషయంలో ఆందోళన అవసరం లేదు

Bhavani

తునిలో మంత్రి ధర్మాన మునిసిపల్ ఎన్నికల ప్రచారం

Satyam NEWS

జగన్ రాజ్యంలో ఒక జర్నలిస్టు ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment