33.2 C
Hyderabad
May 3, 2024 23: 14 PM
Slider ప్రత్యేకం

పాలేరులో పోటీ చేసేది ఎవరు..?

#tummala

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా ఆయా నియోజకవర్గాలలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్డుల జాబితా ఖరారు కాలేదు. దీంతో ఆయా నియోజకవర్గాలల్లో ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఉత్కంట నెలకొన్నది. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా అదే పరిస్తితి. కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఇక్కడ తొలుత రాయల నాగేశ్వర రావు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆయన కూడా నియోజకవర్గాలోని 4 మండలలో తిరుగుతూ ప్రచారం చేశారు. కానీ మారిన రాజకీయ పరిణామాలలో పొంగులేటి శ్రేనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లో కాంగ్రెస్ లో చేరటంతో ఈ సీటు ప్రాధాన్యం పెరిగింది.

తుమ్మల కాంగ్రెస్ చేరే సమయంలోనే పాలేరు టికెట్ ఇస్తామంటేనే వస్తానని చెప్పారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొత్తగూడెం లో పోటీ చేస్తారని ప్రచారం జరిగిని పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాలేరు పై దృస్తి పెట్టారని ఆయన అనుయాయులు చెప్పుకొచ్చారు. దీంతో పాలేరు లో యెవరు పోటీ చేస్తారనే దానిపై సందిగ్డత నెలకొన్నది. మరోవైపు బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధి కందాల ఉపేందర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు యెవరికి వారే నియోజకవర్గంలో విడివిడిగా ప్రచారం చేస్తున్నారు. ఒక ప్రాంతానికి ఒక నేత ఈ రోజు వస్తే, మరో నేత మరుసటి రోజు వస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలలో అయోమయం నెలకొన్నది. వారి అనుచరులు మాత్రం తమ నేత పాలేరులోనే పోటీ చేస్తారని ధీమాగా వున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచె సమయo దగ్గరపడుతున్నా నేతల మధ్య సయోధ్య లేకపోవటం పట్ల ఇక్కడి సీనియర్ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజక వర్గాలలో ఒకటిగా వున్న పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో నేతలంతా ఒక్కతాటి పైకి రాకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని నేతలు చెబుతున్నారు. ఇటీవల కాలం వరకు పోటీ చేస్తానని తిరిగిన రాయల నాగేశ్వరరావు ప్రస్తుతం తుమ్మల నాగేశ్వర రావు తో కలిసి పర్యటిస్తున్నారు . పొంగులేటికి బదులుగా ఆయన సోదరుడు ప్రసాదరెడ్డి, దయాకర్ రెడ్డి లు విస్తృతoగా పర్యాటనాలు చేస్తున్నారు. గడప గడపకు కాంగ్రెస్ పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారు. తుమ్మల కూడా గ్రామాలలో తిరుగుతూ తనకు మద్దతు ఇవ్వాలని సమావేశాలు పెట్టి చెపుతున్నారు.కాగా పాలేరు నియోజకవర్గంలో నేతలతంతా ఒక్కటై తిరగాలని, అందుకు అధినాయకత్వం జోక్యం చేసుకోవాలని నియోజకవర్గంలో సీనియర్లు కోరుతున్నారు. వేరే పార్టీ నుండి తమ పార్టీలోకి వచ్చిన ఆ నేతలను గౌరవంగా చూస్తున్నామని, కానీ వారంతా ఒక్కటీల వుంటీ బావుంటుందని చెపుతున్నారు. ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా గెలిపిస్తామని, కానీ ఇద్దరి మధ్య సఖ్యత లేకపోతే కష్టమేనని చర్చ ఊరూరా సాగుతున్నది.

Related posts

విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని నిరసన

Satyam NEWS

తెలంగాణ భవన్ లో విమోచన దినం

Satyam NEWS

పవన్ కల్యాణ్ ఒరిజినల్ క్యారెక్టర్ ఇది

Satyam NEWS

Leave a Comment