26.7 C
Hyderabad
May 16, 2024 08: 19 AM
Slider రంగారెడ్డి

అడ్వాన్స్‌డ్ క్లీన్ ఎనర్జీపై ముగిసిన జాతీయ స్థాయి కార్యశాల

#workshop

సిబిఐటి లో గల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం  సస్టైనబిలిటీ అండ్ ఎనర్జీ ప్రాక్టీషనర్‌ అసోసియేషన్ ల  సహకారంతో   నిర్వహించిన అడ్వాన్స్‌డ్ క్లీన్ ఎనర్జీపై రెండు రోజుల జాతీయ స్థాయి  కార్యశాల ఈ  నెల 23 మరియు 24 నాడు నిర్వహించిన  “సుస్థిర భారత్ 2023” కార్యక్రమము ముగిసినది. ఈ కార్యక్రమానికి   సిబిఐటి   ప్రిన్సిపాల్ ప్రొఫెసర్  సి.వి.నరసింహులు విచ్చేసిన ఆతిధులకి , ఆధ్యాపకులకి, విద్యార్థులకి  స్వాగతం పలికారు.   ముఖ్య అతిధి గా   టిఎస్ఆర్ఈడిసిఓ  వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. జానయ్య  మాట్లాడారు.  

ఎమ్ఎస్ఎమ్ఈ  – డెవలప్‌మెంట్ ఆఫీసర్  మరియు అసిస్టెంట్ డైరెక్టర్ కె.శివరామ ప్రసాద్  ముఖ్య ప్రసంగం చేశారు.   ఎస్ఈపిఎ   వైస్ ప్రెసిడెంట్ శ్రీ  కిషోర్ భువరాఘ మాట్లాడుతూ అధునాతన సోలార్ పివి  మాడ్యూల్ సాంకేతికతలు గురించి వివరించారు.  ఎస్ఈపిఎ ప్రెసిడెంట్  డాక్టర్ రఘురాం అర్జునన్,  ఎఫ్ఆర్ఎస్సి సైంటిస్ట్ ‘జి’ హెడ్ (సెంటర్ ఫర్ సోలార్ఎ నర్జీ మెటీరియల్స్) డాక్టర్. ఎస్. శక్తివేల్ మాట్లాడుతూ గురించి “సోలార్ ఎనర్జీలో సవాళ్లు మరియు అవకాశాలు గురుంచి వివరించారు.    సోలార్‌లో సవాళ్లు మరియు అవకాశాలపై చర్చాగోష్టి జరిగింది.  ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు మరియు సహ-ఛైర్మన్ – ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్  ఎఆర్సిఐ ఎమ్  వినోద్ కుమార్,  ఈ కార్యక్రమ కన్వీనర్  డా. వసంత గౌరి  , కోఆర్డినేటర్స్ డాక్టర్ టి మురళి కృష్ణ డాక్టర్ ఎన్ ఫణీంద్ర బాబు, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు హాజరైనారు.

Related posts

ఇంటర్ ఫలితాల్లో కేజీబీవీ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

Satyam NEWS

స‌ర్వం ల‌యాధీనం….ల‌య ప్ర‌జ్ఙ వాద్య శిక్ష‌ణా కేంద్రం…! ఎక్క‌డంటే..?

Satyam NEWS

ఈ సారి చంద్రబాబు గెలవకపోతే…..

Satyam NEWS

Leave a Comment