37.7 C
Hyderabad
May 4, 2024 13: 16 PM
Slider పశ్చిమగోదావరి

చింతలపూడి టీడీపీ అభ్యర్ధిపై విస్తృత చర్చ

#chandrababu

ఏలూరు జిల్లా చింతలపూడి రిజర్వ్డ్ నియోజకవర్గ టి డి పి ఎం ఎల్ ఏ అభ్యర్థి ఎంపిక పై రాష్ట్ర టి డి పి అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. అయితే కొంత మంది టి డి పి శ్రేణులు ఎం ఎల్ ఏ అభ్యర్థిగా చింతల పూడి నియోజక వర్గ పరిధిలో పార్టీ కోసం కష్టపడుతున్న  ఉన్న లోకల్ యువతకు ప్రాధాన్యత  ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం. చింతలపూడి పై ఆశలు పెంచుకుంటున్న  ఎన్ ఆర్ ఐ లకు టిక్కెట్ ఇస్తే వాళ్ళు స్థానికంగా ఉండరు సరికదా నియోజక వర్గ భౌగోళిక, ఆర్థిక, సామాజిక పరిస్థితులు వాళ్లకు తెలియదని స్థానిక టి డి పి యువ నాయకత్వం పార్టీ అధిష్టానానికి తెలిపినట్టు సమాచారం.

చింతలపూడి పరిస్థిని పార్టీ రాష్ట్ర అధినాయకుడు చంద్ర బాబు నాయుడును కలిసి యువ టి డి పి నేతలు విన్నవించినట్టు సమాచారం. ఈ ప్రతిపాదన ను కూడా పార్టీ అధిష్టానం పరిశీలన చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటె ఇప్పటికే నియోజక వర్గం లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నియోజక వర్గం లో మంచి గుర్తింపు తెచ్చుకున్న  ధర్మాజీగూడెం కు చెందిన ఒక విద్యావంతుడు ఎన్ ఆర్ ఐ సొంగా రోషన్ కుమార్ కూడా టి డి పి అభ్యర్థి రేసులో ఉన్నారు. ఒక మాజీ ఐ ఏ ఎస్ అధికారి కుమారుడు సంత  నూతలపాడు టి డి పి నాయకుడు మాజీ ఎం ఎల్ ఏ సోదరుడు బొమ్మాజీ అనిల్  కూడా చింతలపూడి టి డి పి  ఎం ఎల్ ఏ అభ్యర్థి గా టిక్కెట్ ఆశిస్తూ నియోజక వర్గం లో టి డి పి  సీనియర్, జూనియర్ నాయకులను పరిచయం చేసుకుంటూ మంచి ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొవడం విశేషం. అంతే కాదు దాదాపుగా తన అభ్యర్థిత్వం ఖరారైందని కూడా తెలుపుతున్నట్టు సమాచారం. వీళ్లిద్దరూ కాక జంగారెడ్డి గూడెం ప్రాంతానికి చెందిన ఒక ఆటో మొబైల్ షోరూం

అధినేత కూడా చింతలపూడి టి డి పి టిక్కెట్ కోసం ఆశించినట్టు సమాచారం. ఈ ముగ్గురు ఆశావహులకన్నా ముందు చింతలపూడి నియోజక వర్గ కేంద్రం నుండి ఇరువురు, లింగపాలెం మండలం నుండి ఇరువురు యువ టి డి పి నాయకులు చింతలపూడి ఎం ఎల్ ఏ టిక్కెట్ పై ఎన్నో ఆశలు పెంచుకున్నారని సమాచారం. ఇది ఏమైనా ఆర్థిక బలం, అంగ బలం, పార్టీ అండ దండలు ఆశీస్సులు మెండుగా ఉన్న బొమ్మే ఆజీ అనిల్ లేదా సొంగా రోషన్ ల లో ఎవరో ఒకరికి  చింతలపూడి టి డి పి టిక్కెట్ ఖాయం అని  భోగట్టా. అయితే మెజారిటీ టి డి పి నాయకత్వం  బొమ్మాజీ అనిల్ వైపే మొగ్గుచూపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

Related posts

పేద విద్యార్థికి చేయూతనిచ్చిన ఉప్పల ఛారిటబుల్ ట్రస్టు

Satyam NEWS

మత్తు పదార్ధాలతో చిత్తు కావద్దు

Satyam NEWS

అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు

Satyam NEWS

Leave a Comment