29.7 C
Hyderabad
April 29, 2024 10: 15 AM
Slider నిజామాబాద్

ఇంటర్ ఫలితాల్లో కేజీబీవీ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

#bichkunda

ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 76.79 శాతం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 83.33%, ఎం పి హెచ్ డబ్ల్యు ప్రథమ సంవత్సరం 88.24%, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించినట్లు కామారెడ్డి జిల్లా బిచ్కుంద కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రత్యేక అధికారిని రాగిణి తెలిపారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సీఈసీ మొదటి సంవత్సరంలో 23 మంది పరీక్షలు రాయగా 13 మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారన్నారు.

9 మంది ఫెయిలయ్యారు అన్నారు. వీరిలో అత్యధిక మార్కులు జె స్రవంతి 418, కే అనిత 411, ఈ సవిత 388.(ప్రథమ సంవత్సరం ఉత్తీర్ణత 59.09%), ద్వితీయ సంవత్సరం 20 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 12 మంది ఉత్తీర్ణులు కాగా 8 మంది ఫెయిలయ్యారన్నారు. వీరిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులు పి సుబంగి 858, మొగులవ్వ 852, కే అనిత 851, కే చంద్రభాగ 813,   (ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణత శాత 60%,)ఇక ఎం పి హెచ్ డబ్ల్యు మొదటి సంవత్సరంలో 37 మంది గాను 34 మంది పరీక్షలు రాయగా 30 మంది ఉత్తీర్ణత సాధించగా నలుగురు ఫెయిల్ అయ్యారు అన్నారు.

వీరిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులు ఎస్ లక్ష్మి 485, జే అఖిల 469, టి అనురాధ 463, (వీరి ఉత్తీర్ణత శాతం 88.24) కాగా  ద్వితీయ సంవత్సర  ఎం పి హెచ్ డబ్ల్యు  విద్యార్థుల వివరాలు 28 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ  ఉత్తీర్ణత సాధించారన్నారు. వీరిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిలు  కే విజయలక్ష్మి 968, టి ఇంద్రజ 965. (ఉత్తీర్ణత శాతం 100.) సిఇసి మొదటి సంవత్సరం, ఎంపీహెచ్డబ్ల్యు మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం 76.79% కాగా, సిఇసి  ద్వితీయ సంవత్సరం, ఎం పి హెచ్ డబ్ల్యు   ద్వితీయ సంవత్సరం 83.67% ఉత్తీర్ణత సాధించారన్నారు. ఉత్తీర్నైన విద్యార్థులకు, వారి ఉత్తీర్ణతకు సహకరించిన అధ్యాపక బృందానికి ఆమె ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

జి లాలయ్య సత్యం న్యూస్, జుక్కల్ నియోజకవర్గం

Related posts

హెబ్బా పటేల్ నటించిన B&W (బ్లాక్ & వైట్) చిత్ర టీజర్‌ విడుదల

Bhavani

విద్య,వైద్యం ప్రభుత్వ బాధ్యత: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

Satyam NEWS

కాంగ్రెస్ గూటికి చేరబోతున్న వివేకా కుమార్తె సునీత

Satyam NEWS

Leave a Comment