40.2 C
Hyderabad
May 5, 2024 15: 57 PM
Slider ప్రపంచం

వరల్డ్ ఫుడీస్:బిర్యానీ కోసమే గూగుల్‌లో తెగ సెర్చింగ్

world google search chicken biryani survey

ప్రపంచవ్యాప్తం‌గా ఎక్కువమంది గూగుల్‌లో దేనికోసం వెతుకుతున్నారా తెలిస్తే నోరెళ్ళ బెడుతారు.ఎందుకంటే నోట్లే వేసుకుని తినే కమ్మని రుచి గల చికెన్ బిర్యానీ కోసమేనట.ప్రపంచము లో అత్యధికులు వెతికిన వంటకాల్లో చికెన్ బిర్యానీ అగ్రస్థానంలో నిలిచింది. ‘ఎస్ఈఎంరష్’ అనే సంస్థ చేసిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. చికెన్ బిర్యానీ కోసం ప్రతి నెల ఏకంగా 4.56 లక్షల మంది గూగుల్ లో వెతుకుతున్నట్టు తేలింది.

ఆ తర్వాతి స్థానంలో బటర్‌ చికెన్‌, సమోసా, చికెన్‌ టిక్కా మసాలా, దోశ, తందూరి చికెన్‌, పాలక్‌ పనీర్‌, నాన్‌, దాల్‌‌మఖని, చాట్‌ వంటి భారత వంటకాలు నిలిచాయి. వీటి గురించి కూడా నెటిజన్లు పెద్ద సంఖ్యలో వెతుకుతున్నట్టు అధ్యయనంలో తేలింది.సమోసా కోసం 3.9 లక్షల సెర్చ్‌ లు రాగా, చికెన్‌ టిక్కా మసాలా కోసం నెలకు సగటున 2.5 లక్షల సెర్చ్‌లు వస్తున్నట్టుపంజాబీ ప్రత్యేక వంటకమైన బటర్ చికెన్ కోసం 4 లక్షలసార్లువారు సెర్చ్ చేసినట్లు‘ఎస్ఈఎంరష్’ తెలిపింది.

Related posts

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ

Satyam NEWS

ఆరోగ్యం పై ప్రతీ ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలి: ఎస్పీ ఎం.దీపిక

Satyam NEWS

9, 10 తరగతులకు ఐఐటీ ఫౌండేషన్ @ టెలిగ్రామ్ యాప్

Satyam NEWS

Leave a Comment