29.7 C
Hyderabad
May 3, 2024 05: 58 AM
Slider విజయనగరం

ఆరోగ్యం పై ప్రతీ ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలి: ఎస్పీ ఎం.దీపిక

#bollddonationcamp

పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు

విజయనగరం జిల్లాలో ఈ నెల 21 నుండి 31 వరకు నిర్వహిస్తున్న పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు పరేడ్ గ్రౌండులో  తిరుమల-మెడికవర్ యాజమాన్యం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ వైద్య శిబిరానికి జిల్లా ఎస్పీ ఎం. దీపిక ముఖ్య అతిధిగా హాజరై, వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ – శాంతి భద్రతల పరిరక్షణకు అంతర్గత భద్రతకు పోలీసుశాఖ శక్తి వంచన లేకుండా పని చేస్తూ, తమ ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధవహించక పోవడం వలన, అనారోగ్యం పాలవుతున్నారన్నారు. అంతేకాకుండా, ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ, విధి నిర్వహణ లో ప్రాణాలను సైతం కోల్పోతున్నారన్నారు.

మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల త్యాగాలు వృధా కారాదని, వారి త్యాగాలను స్మరించుకొంటూ, తిరుమల – మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం కార్డియాలజీ, జనరల్ ఫిజీషియన్, గ్యాస్ట్రో ఎండ్రాలజిస్టు, మెడికల్ అంకాలజిస్టు, హెమటాలజిస్టు వైద్యులు సహకారంతో పోలీసు కుటుంబాలకు, సామాన్య ప్రజలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు.

ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ కోరారు. ఈ మెగా మెడికల్ క్యాంపులో పోలీసు కుటుంబాలు, సామాన్య ప్రజలు సుమారు 120మంది పాల్గొనగా, వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను పంపిణీ చేసారు. తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న కొంతమందిని గుర్తించి, మెరుగైన వైద్యం కోసం తిరుమల-మెడికవర్ ఆసుపత్రికి రిఫర్ చేసారు.

ఈ మెడికల్ క్యాంపులో తిరుమల నర్సింగు హెూం ఎం.డి. డా. తిరుమల ప్రసాద్, కార్డియాలజిస్టు డా॥జ్యోతి, జనరల్ ఫిజీషియన్ డా.రవి కిరణ్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డా.శ్రవణ్ కుమార్, మెడికల్ అంకాలజిస్టు డా.రమావత్ దేవ్, హెమటాలజిస్టు డా. సాహిత్య, సెంటర్ హెడ్ డా॥ వి.ఎన్. పద్మ కుమార్, తిరుమల – మెడికవర్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొని, వైద్య సేలందించారు. ఈ కార్యక్రమంలో డా కే. తిరుమల ప్రసాద్, డిఎస్పీ టి.త్రినాధ్, సిఐలు జి.రాంబాబు, సిహెచ్. లక్ష్మణరావు, ఆర్ఐలు పి. నాగేశ్వరరావు, చిరంజీవి, ఆర్ఎస్ఐ నారాయణరావు, వైద్యులు, పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

కూతురిపై కన్నేశాడు కొడుకు చేతిలో చచ్చాడు

Satyam NEWS

లేడీ సూపర్ స్టార్ నయనతార ఇక బాలివుడ్ లోకి

Satyam NEWS

విక్రమ సింహపురి వర్సిటీకి ఎన్ఎస్ఎస్ అవార్డు

Satyam NEWS

Leave a Comment