27.7 C
Hyderabad
May 16, 2024 07: 07 AM
Slider విజయనగరం

విజయనగరం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లో ప్రపంచ జ‌ల‌ దినోత్సవం

#worldwaterday

మానవాళికి నీరే ప్రాణాధారమని ఏపీలోని విజ‌య‌నగరం మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి లు పేర్కొన్నారు. ప్రపంచ జ‌ల‌ దినోత్సవం సంద‌ర్బంగా  న్యూపూర్ణ జంక్ష‌న్ ఉన్న‌ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో  భూగ‌ర్భ జ‌ల‌వ‌న‌రుల శాఖ ఓస‌ద‌స్సును నిర్విహించింది..ఈ సంద‌ర్భంగా మేయ‌ర్,డిప్యూటీ మేయ‌ర్లు.. నీటి వినిమయం ఆవశ్యకత గురించి వివరించే పోస్టర్లను ఆవిష్కరించారు.

అలాగే నీటిని పొదుపుగా వాడుకోవాలని నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ విక్రమాదిత్య వ‌ర్క్ షాప్ న‌కు వ‌చ్చిన ప్ర‌తీ ఒక్క‌రి చే  ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భూగర్భ జలాల ఆవశ్యకత, సవాళ్ళు వంటి అంశాలపై  భూగర్భ శాఖ ఏడి రమణమూర్తి వివరించారు. ఈ సందర్భంగా గా మేయర్ విజయలక్ష్మి ,డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ  నీరు లేని భూమి ఊహకందని విషయంమ‌న్నారు. పచ్చని చెట్లు, పారే నదులు, సముద్రాలు, జీవులు నీటి ఉనికి లేకుండా ఉండలేవన్నారు. ఇవేవీ లేకుండా ఎండిపోయిన మట్టి గడ్డలా భూమి ఉంటుందని తెలిపారు. అంతటి అమూల్యమైన నీటి విలువను తెలుసుకోవడానికి, దానిని వృధా చేయకుండా అవగాహన కల్పించడానికి ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు.

నిత్యజీవితంలో నీటిని అనేక రకాలుగా ఉపయోగిస్తామని అనేక వ్యాధులను కూడా నీరు వల్లే తగ్గే అవకాశం ఉందని చెప్పారు. . భూమి మీద మూడొంతులు నీరే ఉందని కానీ అందులో 97 శాతం ఉప్పునీరే నని డిప్యూటీ మేయ‌ర్ కోల‌గ‌ట్ల శ్రావ‌ణి  అన్నారు. కేవలం మూడు శాతం మాత్రమే మంచి నీరు ఉందని అందులో కూడా రెండు శాతం మంచు రూపంలో ఉంటుందని ఆమె తెలిపారు. మిగతా ఒక్క శాతంలో 0.59 శాతం భూగర్భంలో ఉంటే మిగతాది నదులు సరస్సులు రూపంలో ప్రవహిస్తుందని అన్నారు.

స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చొరవతో చాలా ఏళ్ల తర్వాత నగరంలో మంచినీటి కుళాయిలు ఏర్పాటు ద్వారా ప్రజలకు తాగునీరు అందించే ప్రయత్నం జరుగుతోందన్నారు.  నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ మాట్లాడుతూ మనిషి దైనందిన జీవితంలో ఎంతో ముఖ్యమైన నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో మంచినీటిలో 70 శాతాన్ని వ్యవసాయానికి, 22 శాతాన్ని పరిశ్రమలకు ఉపయోగిస్తున్నారన్నారు. 

భూగర్భ శాఖ ఏడి రమణమూర్తి మాట్లాడుతూ గ‌డ‌చిన ఇర‌వై ఏళ్ల  నుంచీ  ప్రపంచ జ‌ల‌ దినోత్సవాన్ని కి ప్రత్యేక అంశంగా తీర్చిదిద్ది ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారన్నారు. నీటిని వృధా చేస్తే భవిష్యత్తులో మానవాళి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో క్రిడయ్ అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్, నగరపాలక సంస్థ ఈఈ డా.కిల్లాన దిలీప్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ అమ్మాజీ రావు, టి పి ఓ  లక్ష్మి, డిఈ అప్పారావు, వివిధ సంస్థల ప్రతినిధులు కాపు గంటి ప్రకాష్, ముచ్చు రామలింగస్వామి, ప్రణాళిక కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పాదయాత్రకు రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చి, పాల్గొంటే తప్పేంటి?

Bhavani

విద్యార్థుల‌కు డ్రగ్స్ విక్ర‌యిస్తున్న ముఠా గుట్టురట్టు

Satyam NEWS

సామాజిక బాధ్యత గుర్తుచేసేందుకు 555 కిలోమీటర్ల నడక

Satyam NEWS

Leave a Comment