37.2 C
Hyderabad
May 2, 2024 13: 17 PM
Slider విశాఖపట్నం

పాదయాత్రకు రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చి, పాల్గొంటే తప్పేంటి?

న్యాయ ప్రక్రియ కొరకు నాలుగు రోజులు అరసవల్లి పాదయాత్ర ఆగగానే, మంత్రి బొత్స సత్యనారాయణ పాదయాత్ర రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాదయాత్రలో 60 మంది రైతులే పాల్గొంటే,ప్రభుత్వానికి అంత ఉలికెందుకు? అని ప్రశ్నించారు. రెచ్చగొట్టే ప్లకార్డులు, ఫ్లెక్సీలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.

రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్ స్వయంగా పాదయాత్ర పై చెప్పులతో దాడి ఎందుకు చేశారని ప్రశ్నించారు. డిఎస్పీ మాధవ రెడ్డి స్వామి భక్తి దేనికి చూపారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఏటా రూ.190 కోట్లు కౌలుగా చెల్లిస్తుందని, ఈ కౌలు తీసుకుంటున్న రైతులు 60 మంది రైతులేనా? అని ధ్వజమెత్తారు. ఇచ్చిన 34,324 ఎకరాలు 60మంది రైతులవా? అన్నారు. పాదయాత్రకు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలు పాదయాత్ర లో పాల్గొంటే తప్పేంటి?అని నిగ్గదీశారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు ఏడాది క్రితం జరిగిన పాదయాత్రలోనే మూడు ప్రాంతాల ప్రజలు అమరావతికి అండగా ఉన్నారన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయిందని, పదే పదే పాదయాత్రల ద్వారా మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా రైతులకు లేదని తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన మూడు రాజధానులు మూడు ప్రాంతాల్లో బస్మాసుర హస్తం వంటిదని, 18నెలల్లో వైకాపా ప్రభుత్వాన్ని, భవిష్యత్తులో రాష్ట్ర సమైక్యతను కూడా బూడిద చేస్తుందని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర కోసం పదవులకు రాజీనామాలు చేస్తామన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ మాటే మరిచారని చెప్పారు. వైకాపా నాయకులకు పదవులు, ముఖ్యమంత్రి మెప్పు తప్ప, ఉత్తరాంధ్ర ప్రజల బాగోగులు, అభివృద్ధి అవసరం లేదని బాలకోటయ్య పేర్కొన్నారు.

Related posts

ఉపాధి హామీ కాంట్రాక్టర్ల బిల్లులు తక్షణమే చెల్లించాలి

Satyam NEWS

కాశీ లో అనైతికం: అమ్మాయిలు దుస్తులు మార్చుకునే దృశ్యాలు రికార్డు

Satyam NEWS

నరేంద్ర మోడీ ఎన్నికపై సుప్రీంకోర్టు తీర్పు రేపు

Satyam NEWS

Leave a Comment