34.2 C
Hyderabad
May 14, 2024 21: 28 PM
Slider విజయనగరం

పెంచిన గ్యాస్,డీజిల్,నూనె ధ‌ర‌ల‌కు వ్య‌తిరేకంగా సీపీఐ నిర‌స‌న‌

#cpiprotest

పెంచిన గ్యాస్,పెట్రోల్,డీజిల్ ,నూనె ద‌ర‌ల‌ను వ్య‌తిరేకంగా విజ‌య‌న‌గ‌రంలో సీపీఐ నిర‌స‌న‌ల‌ను వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు ఆ పార్టీ జిల్లా కార్య‌ద‌ర్శి బుగ‌త అశోక్ నెత్తిన గ్యాస్ బండ పెట్టుకుని..జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద లోవ‌ర్ ట్యాంక్ బండ్ వ‌ద్ద  నిర‌స‌న తెలియ చేసారు. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్  సిలిండర్ ధరలను తగ్గించకపోతే ప్రజల ఆగ్రహ జ్వాలల్లో మోడీ ఆహుతి కాక తప్పదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.సోమవారం అర్ధరాత్రి నుంచి గ్యాస్ ధర 50 రూపాయలు, పెట్రోల్, డీజిల్ మీద సుమారు రూపాయి పెంచడంపై సీపీఐనిర‌స‌న వ్య‌క్తం చేసింది.

ఈ సంద‌ర్బంగా   బుగత అశోక్ విలేఖ‌రుల‌తో మాట్లాడుతూ ప్ర‌ధాని మోడీ ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశానికి గాని ప్రజలకు గానీ చేసిందేమీ లేదన్నారు. కార్పొరేట్లకు లాభాలు చేకూరుస్తూ రాయితీలు కలిపిస్తూ ప్రజల పై ఆర్ధిక భారం మోపడమే 24 గంటలు విశ్రాంతి లేకుండా తన పని గా పెట్టుకున్నారని ఆరోపించారు.. నరేంద్రమోడీ ప్రధానమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని కార్పొరేట్ దొంగలు అంబానీ, ఆదాని ఆస్తులు కూడపెట్టడమే విధిగా ఆయన పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు.

మోడీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్ళ కాలంలో 350 రూపాయలు ఉండే వంట గ్యాస్ 1000 రూపాయిలు, 60 రూపాయిలు ఉండే పెట్రోల్, డీజిల్ ధరలు 110 రూపాయిలు పెంచిన ఘనత మోడీకే దక్కిందని ఎద్దేవా చేశారు.  పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, వంట గ్యాస్, వంట నూనె మొదలైన అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని సీపీఐ గా ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.

పెంచిన ధరలు తగ్గించలేని ఎడల ప్రజా వ్యతిరేక బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో నరేంద్ర మోడీని, బీజేపీ పార్టీని భారత దేశంలో బంగాళాఖాతంలో నిమజ్జనం చేయడానికి జరుగుతున్న పోరాటాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ప్రజలకి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.రంగరాజు, తుమ్మి అప్పలరాజు దొర, టి.జీవన్, జిల్లా సమితి సభ్యులు అప్పరుబోతు జగన్నాధం, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య పట్టణ కార్యదర్శి కె.శ్రవంతి, కళావతి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొల్లాపూర్ లో కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్

Bhavani

హనుమాన్ జయంతి యాత్రకు సంపూర్ణ సహకారం

Satyam NEWS

ఆంక్షలున్నా అందాల పోటీలు నిర్వహిస్తాం.. ఇజ్రాయెల్‌

Sub Editor

Leave a Comment