28.7 C
Hyderabad
May 6, 2024 08: 45 AM
Slider ప్రత్యేకం

ఫ‌స్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఫోన్ నెంబ‌ర్ కు ఫేక్ మెసేజ్ లా..?

#suryakumariias

అలెర్ట్ అయిన క‌లెక్ట‌ర్ వాట్సప్ సందేశాలకు స్పందించొద్ద‌న్న క‌లెక్ట‌ర్…!

ఆమె జిల్లాకే ఓ ఫ‌స్ట్ క్లాస్ మెజిస్ట్రేట్.జిల్లాలో ఎంత‌టి స‌మ‌స్య వ‌చ్చినా  ఎలాంటి త‌గాదా వ‌చ్చినా  చివ‌ర‌కు ఆమెనే నిర్ణ‌యించాలి. ఆమెనే తీర్పు చెప్పాలి..ఆమెకే స‌ర్వ అధికారాలు ఉన్నాయి.ఆమె మ‌రోవ్వ‌రో కాదు ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ. ఇటీవ‌లే క‌లెక్ట‌ర్ ఫోన్  నెంబర్ కే షాకింగ్ మెసేజ్ లు .ఇప్పటికే జిల్లాక‌లెక్టర్ సూర్య‌కుమారీ ఫోన్ నెంబ‌ర్ కు తెలియ‌ని నెంబ‌ర్ నుంచీ వాట్సాప్ మెసేజ్ లు వ‌స్తునే ఉన్నాయి.అంతేనా క‌లెక్ట‌ర్ తో పాటు .దీనికి తోడు..జిల్లా కలెక్టర్  సూర్యకుమారి పేరుతో మరికొన్ని మొబైల్ నంబర్ ల నుంచి మరికొందరు జిల్లా అధికారులకు వాట్సప్ సందేశాలు అందాయి. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.వి. రమణ కుమారి కి 8512978529 మొబైల్ నంబర్ నుంచి జిల్లా కలెక్టర్  పేరుతో వాట్సప్ సందేశాలు అందాయి. ఆమె ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు.దీంతోవెంట‌నే  క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ స్పందించారు. తక్ష‌ణం…టెలిపోన్ శాఖ‌ను  సంప్ర‌దించ‌డంతో పాటు…ఇటుశాఖా సిబ్బందికి కూడా స‌మాచారం ఇచ్చారు.ఏ శాఖ‌లోనైనా…లేదా అధికారులు, ఉద్యోగుల్లో ఎవరికి డబ్బు ఖాతాలో వేయమని, బ్యాంక్ ఖాతా నంబర్స్ పంపించాలని  సందేశాలు అందినా వాటిని తన దృష్టికి తీసుకు రావాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అలాంటి సందేశాలకు స్పందించి డబ్బు ఖాతాలో వేయడం వంటి పనులకు పాల్పడవద్దని అప్రమత్తంగా వుండాలని కోరారు.

Related posts

మొండి బకాయిలపై అధికారులు స్పందించరేం?

Satyam NEWS

రామ మందిర నిర్మాణానికి  గ్రానైట్ విరాళం

Satyam NEWS

త్వరత్వరగా వచ్చేస్తున్న ఈశాన్య రుతుపవనాలు

Satyam NEWS

Leave a Comment