27.7 C
Hyderabad
May 14, 2024 09: 42 AM
Slider రంగారెడ్డి

చేవెళ్లలో ఘనంగా ఎల్లో డే

#yellowday

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం లో శ్రీ సాయి చైతన్య స్కూల్‌ నర్సరీ విద్యార్థులు ప్రాంగణంలో ‘ఎల్లో డే’ జరుపుకున్నారు. ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి, ఉపాధ్యాయులు ఉమా రాణి, అనిత కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్ధులు తెల్లటి కాగితాన్ని పసుపుతో పెయింట్ వేసి దాని నుండి వివిధ వస్తువులను కత్తిరించి కోల్లెజ్‌ తయారు చేశారు. ఈ సందర్భంగా  విద్యార్థుల పసుపు రంగు దుస్తులు ధరించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పసుపు రంగు అంటే సూర్యరశ్మి అని తెలిపారు. విద్యార్థులు పుస్తక జ్ఞానంతో పాటు రాబోయే కాలంలో ఫిట్‌గా ఉంటూ ఉత్తమ వ్యక్తిత్వంగా మారాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు, చాక్లెట్లు పంపిణీ చేశారు.

Related posts

రాజ్యాంగంతో అందరికి సమానత్వంను కల్పించిన మహనీయుడు అంబేద్క‌ర్

Satyam NEWS

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీవీ చానల్‌ పేరుతో మోసం

Satyam NEWS

గ్రామీణ ప్రాంత చిన్నారుల కోసం సోనాలికా ఎడ్యుటెక్‌ ఈ గురుకుల్‌ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment