31.2 C
Hyderabad
May 2, 2024 23: 59 PM
Slider ముఖ్యంశాలు

గ్రామీణ ప్రాంత చిన్నారుల కోసం సోనాలికా ఎడ్యుటెక్‌ ఈ గురుకుల్‌ ప్రారంభం

#sonalika

సోనాలికా ట్రాక్టర్స్‌ జూలై నెలలో రికార్డు స్థాయిలో 10,756 ట్రాక్టర్లను విక్రయించింది. తద్వారా 5.2% వృద్ధిని నమోదు చేసింది. గ్రామీణ భౌగోళిక వాతావరణ పరిస్థితులను చక్కగా అర్థం చేసుకోవడంతో పాటు, రైతుల వేసే పంటలకు తగిన అవసరాలను తీర్చే రీతిలో సోనాలికా తమ ఉత్పత్తులను రూపొందిస్తుంటుంది.

ఈ వినూత్నమైన విధానం కారణంగానే సోనాలికా కంపెనీ తన ప్రత్యేకతను నిలుపుకుంటున్నది. కస్టమైజ్డ్‌ ట్రాక్టర్స్‌, వ్యవసాయ ఉపకరణాలను సమయానుకూలంగా అభివృద్ధి చేస్తుంది. సమాజం పట్ల తమ నిబద్ధతను మరో స్థాయికి తీసుకువెళ్తూ, సోనాలికా ఇటీవలనే ఇంటరాక్టివ్‌  యూట్యూబ్‌ ఛానెల్‌ సోనాలికా ఈ గురుకుల్‌ను ప్రారంభించింది. ఈ ఇన్ఫోటైన్‌మెంట్‌ ఆధారిత ఛానెల్‌ ‘సోనాలికా ఈ గురుకుల్‌’ గ్రామీణ ప్రాంతాలలోని చిన్నారుల విజ్ఞానాన్ని గణనీయంగా వృద్ధి చేయనుంది.

తమ ఆలోచనలను  సోనాలికా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రమణ్‌ మిట్టల్‌ వెల్లడిస్తూ ‘‘రైతుల అవసరాలకు తగినట్లుగా, నేడు వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించే రీతిలో ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చిన కారణంగానే అసాధారణ ప్రదర్శనను మేము నమోదు చేయగలిగాం. మా కస్టమైజ్డ్‌ హెవీ డ్యూటీ ట్రాక్టర్‌ శ్రేణిపై తమ విశ్వాసం ప్రదర్శించిన మా రైతులకు మేము ధన్యవాదములు తెలుపుతున్నాం.

ఈ నమ్మకమే మేము జూలై 2021లో 5.2% వృద్ధితో 10,756 ట్రాక్టర్లను విక్రయించేలా చేసింది. దేశవ్యాప్తంగా వర్షాలు సానుకూలంగా పడుతుండటం, రైతుల వ్యవసాయ అవసరాలు గణనీయంగా మారడంతో , అత్యాధునిక ట్రాక్టర్లుకు డిమాండ్‌ పెరుగుతుందని ఆశిస్తున్నాం. 2022 ఆర్థిక సంవత్సరంలో  కూడా నూతన ఉత్పత్తులను గరిష్టంగా ఉత్పత్తి చేయగలం’’ అని అన్నారు.

ఆయన మాట్లాడుతూ ‘‘రైతులు మా కుటుంబ సభ్యుల్లాంటి వారు. ఈ బంధాన్ని మేము గౌరవిస్తున్నాం. మా పరిశీలనలు వెల్లడించిన దాని ప్రకారం, గ్రామీణప్రాంతాలలో  చిన్నారులు విద్యకు సంబంధించి నూతన ఉపకరణాలను పొందలేకపోతున్నారు. అది దృష్టిలో పెట్టుకుని  యూట్యూబ్‌పై సోనాలికా ఈ గురుకుల్‌ను ప్రారంభించాం. ఈ ఛానెల్‌ను ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంత చిన్నారులను దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దాం. దీని ద్వారా వారి ఆలోచనలను నూతన స్థాయికి తీసుకువెళ్లనున్నాం’’అని అన్నారు.

Related posts

బీ కూల్ రోజమ్మ : అంతా నేనుచూసుకుంటానన్న జగన్

Satyam NEWS

మా పోలీస్ స్టేషన్ పరిధి కాదు అని చెప్పవద్దు

Satyam NEWS

శాటిస్ఫైడ్: పెద్దపాడు పాఠశాల ఆకస్మికంగా తనిఖీ

Satyam NEWS

Leave a Comment