27.7 C
Hyderabad
May 4, 2024 07: 08 AM
Slider ముఖ్యంశాలు

వైఎస్ షర్మిల అరెస్ట్

#YSSHARMILA

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లో  పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఎస్‌ఆర్ నగర్  పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రగతి భవన్ వైపు వెళ్లడానికి ప్రయత్నించిన కారణంగా ఆమెను అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు.  షర్మిల పోలీసుల కళ్లు గప్పి లోటస్ పాండ్ నివాసం నుంచి సొంతంగా కారును డ్రైవ్ చేసుకుంటూ ప్రగతి భవన్ వైపు వెళ్లారు. వేరే మార్గం ద్వారా  కారులో ఒంటరిగా వెళ్లిన విషయం తెలుసుకున్న వెంటనే లోటస్ పాండ్ వద్ద ఉన్న వైఎస్ఆర్టీపీ నాయకులు, కార్యకర్తలు వెంటనే పంజగుట్టకు చేరుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో అద్దాలు పగిలిన కారులో సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ప్రగతి భవన్‌కు వెళ్లడానికి ప్రయత్నించారు. పంజాగుట్ట వద్ద పోలీసులు ఆమెను అడ్డుకుని కారుతో సహా  ట్రాఫిక్ వాహనాలను తరలించే వాహనం ద్వారా ఎస్‌ఆర్ నగర్ పోలీసు స్టేషన్ కు తరలించి బలవంతంగా కారులోనుంచి దింపి స్టేషన్ లోకి తీసుకెళ్లారు.  ఈ అరెస్టు ను బి‌జే‌పి సహా రాజకీయ పార్టీలు ఖండించాయి.

Related posts

క్లీన్, స్మార్ట్ అండ్ సేఫ్ కొల్లూరు డబుల్ బెడ్ రూమ్స్

Satyam NEWS

29న రోమ్ వెళుతున్న ప్రధాని నరేంద్ర మోడీ

Satyam NEWS

కరోనా ఎలర్ట్: నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి

Satyam NEWS

Leave a Comment